Gold and silver prices today : రూ. 66వేల దిగువకి పసిడి ధర.. దిగొచ్చిన వెండి రేటు..-gold and silver prices today 10 june 2024 in india ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : రూ. 66వేల దిగువకి పసిడి ధర.. దిగొచ్చిన వెండి రేటు..

Gold and silver prices today : రూ. 66వేల దిగువకి పసిడి ధర.. దిగొచ్చిన వెండి రేటు..

Sharath Chitturi HT Telugu
Jun 10, 2024 09:19 AM IST

Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు పడ్డాయి. వెండి ధరలు సైతం పడ్డాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (REUTERS)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 65,690కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 65,700గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,56,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,569గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 71,660గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 71,670గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,16,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,166గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,81గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 65,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 71,660గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,490గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,540గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 65,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 71,660గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,660గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,740గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 71,171గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 65,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 71,660గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు ఇలా..

Silver rate today : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,140గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,400గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 91,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 95,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,400.. బెంగళూరులో రూ. 90,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 120 పెరిగి రూ. 25,980కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 25,860గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,980గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం