Gold and silver price today : భారీగా తగ్గిన వెండి ధర- నేటి పసిడి రేటు ఎంతంటే..-gold and silver price today 8 december 2023 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Price Today 8 December 2023 In Telugu

Gold and silver price today : భారీగా తగ్గిన వెండి ధర- నేటి పసిడి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu
Dec 08, 2023 05:50 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు భారీగా పడ్డాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 57,550కి చేరింది. గురువారం ఈ ధర రూ. 57,450గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 పెరిగి, రూ. 5,75,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,755గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 110 వృద్ధి చెంది.. రూ. 62,780కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,670గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 1100 పెరిగి.. రూ. 6,27,800గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,780గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,200గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,490గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,550గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,780గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,550గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,780గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,600గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,780గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,550గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,7800గా ఉంది.

వెండి ధరలు డౌన్​..

దేశంలో వెండి ధరలు భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,720గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 77,200గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 78200గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 80,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 77,200.. బెంగళూరులో రూ. 76,650గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 290 పడి రూ. 23,800కి చేరింది. క్రితం రోజు ధర రూ. 24,090గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం