Gold and silver price today : పసిడి @58,500- నేటి వెండి ధర ఎంతంటే!-gold and silver price today 4th december 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Price Today 4th December 2023

Gold and silver price today : పసిడి @58,500- నేటి వెండి ధర ఎంతంటే!

Sharath Chitturi HT Telugu
Dec 04, 2023 09:12 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా.. (Sanjay Sharma)

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 58,450గా ఉంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,84,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,845గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా.. రూ. 63,760 వద్ద ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,37,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,910గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,450 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 63,760గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 59,150గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,530గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 58,450గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 63,760గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,450గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,500గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,810గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 58,450గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,760గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,050గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 80,500గా ఉంది. ఆదివారం కూడా ఇదే ధర పలికింది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 83,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 80,500.. బెంగళూరులో రూ. 79,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 60 తగ్గి.. రూ. 24,940కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 25,000గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,940గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం