Gold and silver price today : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు..నేటి లెక్కలివే!-gold and silver price today 2nd december 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Gold And Silver Price Today 2nd December 2023

Gold and silver price today : మరింత పెరిగిన పసిడి, వెండి ధరలు..నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Dec 02, 2023 05:46 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 57,700కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,500గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2,000 పెరిగి, రూ. 5,77,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,770గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 220 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,730గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2,200 పెరిగి.. రూ. 6,29,500గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,850గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,100గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 62,950గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 58,500గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,820గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 57,700గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,950గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,700గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,750గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 63,000గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,700గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా ఉంది.

ఇజ్రాయెల్​ పాలస్తీనా యుద్ధం వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,920గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 300 పెరిగి 79,500కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 79,200గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 82,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 79,500.. బెంగళూరులో రూ. 79,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel

సంబంధిత కథనం