Gold and silver price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver price today 25th november 2023 in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and silver price today : దేశంలో పసిడి, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 56,800గా ఉంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,68,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం 5,680గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 61,970గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,19,700గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,197గా కొనసాగుతోంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,120గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,970గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,500గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,800గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,970గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,970గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,020గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,970గా ఉంది.

ఇజ్రాయెల్​- పాలస్థీనా​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,620గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 76,200గా కొనసాగుతోంది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.

Silver price today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,200 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,200.. బెంగళూరులో రూ. 75,200గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం