Gold and silver price today : స్వల్పంగా తగ్గిన పసిడి, స్థిరంగా వెండి.. నేటి లెక్కలివే!-gold and silver price today 21st november 2023 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Price Today : స్వల్పంగా తగ్గిన పసిడి, స్థిరంగా వెండి.. నేటి లెక్కలివే!

Gold and silver price today : స్వల్పంగా తగ్గిన పసిడి, స్థిరంగా వెండి.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Nov 21, 2023 05:37 AM IST

Gold and silver price today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and silver price today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 50 దిగొచ్చి.. రూ. 56,500కి చేరింది. సోమవారం ఈ ధర రూ. 56,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 5,65,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,650గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 50 తగ్గి రూ. 61,640గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 61,690గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 6,16,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 6,164గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,650గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 61,640గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 57,050గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,230గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 56,500గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,640గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 56,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,690గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా ఉంది.

వెండి ధరలు ఇలా..

Silver price today : దేశంలో వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,600గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 76,000గా కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 79,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 76,000.. బెంగళూరులో రూ. 75,000గా ఉంది.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner

సంబంధిత కథనం