Global Health IPO opens tomorrow: మెడాంటా ‘గ్లోబల్ హెల్త్’ ఐపీఓ వివరాలు..-global health ipo opens tomorrow 5 things to know ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Global Health Ipo Opens Tomorrow: 5 Things To Know

Global Health IPO opens tomorrow: మెడాంటా ‘గ్లోబల్ హెల్త్’ ఐపీఓ వివరాలు..

HT Telugu Desk HT Telugu
Nov 02, 2022 08:06 PM IST

Global Health IPO: మెడాంటా బ్రాండ్ పేరుతో వైద్య సేవలను అందిస్తున్న గ్లోబల్ హెల్త్ సంస్థ(Global Health Limited) IPO గురువారం, నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Global Health IPO: భారత్ లో ప్రసిద్ధి గాంచిన వైద్య సేవల బ్రాండ్ మెడాంటా యాజమాన్య సంస్థ Global Health Limited initial public offering(IPO) నవంబర్ 3, గురువారం నుంచి ప్రారంభమవుతోంది. రూ. 2 ముఖ విలువ కలిగిన షేరు ధరల శ్రేణిని రూ. 319 నుంచి రూ. 336 వరకు గా నిర్ధారించారు.

ట్రెండింగ్ వార్తలు

Global Health IPO: రూ. 2206 కోట్లు..

ఈ IPO ద్వారా రూ. 2206 కోట్లను సేకరించాలని Global Health Limited నిర్ణయించింది. ఈ మొత్తాన్ని సంస్థ విస్తరణ కోసం వినియోగించాలని భావిస్తోంది. ఈ IPO కు KFin Technologies Limited రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తోంది.

Global Health IPO: ఈ IPO పూర్తి వివరాలు ఇవీ..

  • ఈ గ్లోబల్ హెల్త్ లిమిటెడ్(Global Health Limited) IPO నవంబర్ 3న ప్రారంభమై, నవంబర్ 7 వరకు కొనసాగుతుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు బుధవారమే ఈ IPO ఓపెన్ అయింది.
  • రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్క షేరు ధర ను రూ. 319 నుంచి రూ. 336 వరకు గా నిర్ధారించారు.
  • నవంబర్ 11 న షేర్ల అలాట్ మెంట్ జరుగుతుంది.
  • అలాటైన ఇన్వెస్టర్ల డి మ్యాట్ ఖాతాల్లోకి షేర్లు నవంబర్ 15న క్రెడిట్ అవుతాయి. అలాట్ కాని వారి డబ్బులు నవంబర్ 14న రిఫండ్ అవుతాయి.
  • స్టాక్ మార్కెట్లో ఈ IPO షేర్లు నవంబర్ 16న లిస్ట్ అవుతాయి.
  • గ్రే మార్కెట్లో బుధవారం ఈ IPO షేర్లు రూ. 25 ప్రీమియంతో ట్రేడ్ అయ్యాయి. అంటే, తొలిరోజు కనీసం రూ. 361 ధరతో ఈ షేరు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశముంది. అయితే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే తేదీ నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా ఈ గ్రే మార్కెట్ ప్రీమియం మారుతూ ఉంటుంది.
  • ఈ IPO లాట్ సైజ్ 44 షేర్లు. అంటే కనీసం 44 షేర్లకు ఇన్వెస్టర్లు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 361 ధరతో ఇందుకు అయ్యే మొత్తం రూ. 14,784. ఇన్వెస్టర్లు మొత్తం 13 లాట్ల వరకు అప్లై చేసుకోవచ్చు.
  • ఇష్యూ సైజ్ లో 50% క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(QII) కోసం రిజర్వ్ చేశారు. 35% రిటైల్ ఇన్వెస్టర్ల కోసం, 15% నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.
  • ఈ సంస్థను డాక్టర్ నరేశ్ ట్రెహాన్ స్థాపించారు.

WhatsApp channel