ఈ పవర్‌ఫుల్ వివో స్మార్ట్‌ఫోన్ మీద మంచి డిస్కౌంట్.. ఇందులో ఎన్నో ఫీచర్లు!-get vivo v50e 5g smartphone on huge discount with best selfie camera and 90w fast charging ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ పవర్‌ఫుల్ వివో స్మార్ట్‌ఫోన్ మీద మంచి డిస్కౌంట్.. ఇందులో ఎన్నో ఫీచర్లు!

ఈ పవర్‌ఫుల్ వివో స్మార్ట్‌ఫోన్ మీద మంచి డిస్కౌంట్.. ఇందులో ఎన్నో ఫీచర్లు!

Anand Sai HT Telugu

వివో పవర్‌ఫుల్ కెమెరా ఫోన్ వివో వీ50ఈ 5జీ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి మంచి అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్ల బెనిఫిట్ కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు.

వివో వీ50ఈ 5జీ

ిడ్ రేంజ్ ధరలో గొప్ప సెల్ఫీ కెమెరా ఫోన్ కావాలనుకుంటే వివో వీ50ఈ 5జీ గొప్ప డీల్ లభిస్తుంది. అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. వివో వీ50ఈ 5జీ అతిపెద్ద హైలైట్ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా. వెనుక ప్యానెల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(ఓఐఎస్)తో కూడిన సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్‌కు ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ మోడ్‌లు ఉన్నాయి. ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియోను అందించారు. ఇది అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఆప్షన్ కూడా అందిస్తుంది. ఐపీ 69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను ఇస్తుంది.

ధర వివరాలు

వివో వీ50ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.28,999గా అమెజాన్‌లో ఉంది. ఈ ఫోన్ కోసం ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల సహాయంతో చెల్లించినట్లయితే వినియోగదారులు రూ .2000 తగ్గింపు పొందుతారు. దీని ధర రూ .26,999 అవుతుంది. ఇతర క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్ కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్

ఒకవేళ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్టంగా రూ.27,549 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. దాని విలువ పాత ఫోన్ మోడల్, దాని పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సఫైర్ బ్లూ, పెరల్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

బ్యాటరీ, ఇతర వివరాలు

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఎఫ్‌హెచ్‌డీ+ (2392×1080 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో 6.77 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 5600 ఎంఏహెచ్ బ్యాటరీ 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది 20 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది.

గమనిక : ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా డిస్కౌంట్ వివరాలు అందించాం. భవిష్యత్తులో ఈ ధర తగ్గవచ్చు, పెరగవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.