Realme Discount : రియల్‌మీ 5జీ ఫోన్‌పై అమేజింగ్ ఆఫర్.. రూ.10,200 వరకు డిస్కౌంట్-get realme gt neo 3t 5g smartphone with huge discount of 10 200 rupees know complete details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme Discount : రియల్‌మీ 5జీ ఫోన్‌పై అమేజింగ్ ఆఫర్.. రూ.10,200 వరకు డిస్కౌంట్

Realme Discount : రియల్‌మీ 5జీ ఫోన్‌పై అమేజింగ్ ఆఫర్.. రూ.10,200 వరకు డిస్కౌంట్

Anand Sai HT Telugu
Oct 23, 2024 09:40 AM IST

Realme GT Neo 3T Discount : పండుగల సీజన్ కావడంతో ఈ కామర్స్ సైట్లు భారీ డిస్కౌంట్‌తో ఫోన్లను విక్రయిస్తున్నాయి. అందులో భాగంగా రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ పై మంచి ఆఫర్ నడుస్తోంది.

రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్
రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్

పండుగ సీజన్ రావడంతో ఈ కామర్స్ సైట్లు కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ ఆఫర్ల కోసం కస్టమర్లు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా రియల్‌మీ 5G ఫోన్‌పై మంచి ఆఫర్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,200 తగ్గింపుతో విక్రయిస్తున్నారు.

రియల్‌మీ జీటీ సిరీస్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇది మంచి ఛాన్స్. రియల్‌మీ జీటీ నియో 3టీ ఫోన్ ధరను కంపెనీ తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 2022లో విడుదలైంది. బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఈఎంఐ ఎంపికలు కూడా ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ జీటీ నియో 3టీని మూడు స్టోరేజ్ వేరియంట్లలో విక్రయిస్తోంది. ప్రస్తుతం 8జీబీ ర్యామ్ ప్లస్ 256డీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.10,200 తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ తగ్గింపు తర్వాత ఫోన్‌ను కేవలం రూ. 23,799కి కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.33,999తో విడుదలైంది.

8డీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.9,600 తగ్గింపు అందుబాటులో ఉంది. తగ్గింపు తర్వాత ఫోన్‌ను రూ. 23,399కి కొనుగోలు చేయవచ్చు. ఇది రూ. 31,999 వద్ద విడుదల చేశారు. అలాగే 6జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.9,000 తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ డిస్కౌంట్‌తో రూ.20,999కి విక్రయిస్తోంది. 29,999కి ఈ ఫోన్ లాంచ్ చేశారు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని వాడితే.. అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కంపెనీ 24 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. రూ. 12,950 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా వస్తుంది. ఈ ఫోన్‌ను డాష్ ఎల్లో, డ్రిఫ్టింగ్ వైట్, షేడ్ బ్లాక్ కలర్‌లలో కొనవచ్చు.

రియల్‌మీ జీటీ నియో 3టీ మొబైల్ 6.62-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ఉంటుంది. కంపెనీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ ఫోన్‌కు శక్తినిస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 650 జీపీయూ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ కలిగి ఉంది. డైనమిక్ ర్యామ్ సపోర్ట్‌తో ర్యామ్‌ను 16జీబి వరకు పెంచుకోవచ్చు.

రియల్‌మీ జీటీ నియో 3టీ మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ లెన్స్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియో, వీసీ కూలింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి.

Whats_app_banner