OnePlus Phone Discount : ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. నెక్‌బ్యాండ్ ఫ్రీ
OnePlus Nord CE4 Lite Discount : వన్‌ప్లస్ ఫోన్ కొనాలి అనుకునేవారికి శుభవార్త. తక్కువ ధరకు 5జీ ఫోన్ మీ సోంతం చేసుకోవచ్చు. అంతేకాదు నెక్‌బ్యాండ్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ఆఫర్‌కు సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం..
వన్‌ప్లస్ మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త. ప్రస్తుతం వన్‌ప్లస్ Nord CE 4 Lite 5G తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లాంచ్ ధర కంటే తక్కువకు విక్రయిస్తున్నారు. అలాగే రూ.1,299 విలువైన నెక్‌బ్యాండ్‌ను ఉచితంగా అందజేస్తున్నారు. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, EMI వంటి ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.
డిస్కౌంట్
వన్‌ప్లస్ లవర్స్‌కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకునే వ్యక్తులకు ఇది బెటర్ ఆప్షన్. ఈ ఫోన్ తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైన్, మంచి క్వాలిటీతో వస్తుంది. నిజానికి వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్‌ను రూ. 19,999కు లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ తర్వాత రూ.16,999కు పొందవచ్చు. మూడు వేల డిస్కౌంట్ వస్తుందన్నమాట.
ఇది కూపన్ తగ్గింపులు, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా కలిగి ఉంటుంది. అమెజాన్ ఈ వన్‌ప్లస్ ఫోన్ మీద కొనుగోలుపై రూ. 3,000 తగ్గింపును అందిస్తోంది. ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు చూద్దాం..
డిస్‌ప్లే
OnePlus Nord CE 4 Lite 5G ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 1080 × 2400 పిక్సెల్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2100 nits ప్రకాశాన్ని సపోర్ట్ చేసే అమోఎల్ఈడీ ప్యానెల్‌పై తయారుచేశారు. కంపెనీ Qualcomm స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఈ 5జీ ఫోన్‌ని ప్రారంభించింది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై నిర్మించిన మొబైల్ చిప్‌సెట్.
ర్యామ్
వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ 5G 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఫోన్‌లో 8GB వర్చువల్ RAM ఉంది, ఇది 16GBతో పాటు ఫిజికల్ ర్యామ్‌కు శక్తినిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. 2TB మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా దీనితో లభిస్తుంది.
కెమెరా
ఈ మొబైల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది OIS, EIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
బ్యాటరీ
OnePlus Nord CE 4 Lite 5Gని 5,500mAh బ్యాటరీతో విడుదల చేసింది. ఇది 80W సూపర్‌వోల్క్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంది. 52 నిమిషాల్లో ఫోన్‌ను 1 శాతం నుండి 100 వరకు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ మొబైల్ 5W రివర్స్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది.