iPhone Discount : మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకున్నట్టైతే ఈ సూపర్ ఆఫర్ మిస్ చేయకండి
iPhone Discount Offer : ఐఫోన్ వాడాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొనాలంటే కాస్త ఎక్కువ ధర. దీనితో వెనక్కు తగ్గుతారు. కానీ ఐఫోన్ 15పై ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. మీరు కొనుగోలు చేయవచ్చు.
యాపిల్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మంచి ఆఫర్ ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ వివిధ ఆఫర్లను ఇస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు డిస్కౌంట్ అందిస్తుంది. ఐఫోన్ కొనాలి అనుకునేవారికి బంపర్ ఆఫర్ నడుస్తోంది. స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా మంచి ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై డిస్కౌంట్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ ఐఫోన్ 15 ఫోన్ మీద కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది.
ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 15పై 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు కనిపించింది. ఈ మొబైల్ 128 GB స్టోరేజ్ వేరియంట్ 57,999 రూపాయలకు వస్తుంది. అసలు ధర రూ.69900గా ఉంది. అంతేకాదు.. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల నుండి కూడా డిస్కౌంట్లను పొందవచ్చు.
ఐఫోన్ 15 మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్ సెన్సార్. అలాగే ఇది బ్లూ, గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌లో పని చేస్తుంది. 6.1 అంగుళాల డిస్‌ప్లే, 1600 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. ఇది పిల్-ఆకారపు పంచ్-హోల్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. ఫేస్‌టైమ్ కెమెరా, ఫేస్ ఐడీ కూడా వస్తుంది.
ఐఫోన్ 15 ఐఓఎస్ 16 ఓఎస్ మద్దతుతో వస్తుంది. అలాగే 128 జీబీ 256 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మొదటి కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. మంచి ఫోటోలు తీయడానికి ఇది పనిచేస్తుంది. సెకండరీ కెమెరా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైల్డ్ యాంగిల్ లెన్స్‌ని పొందింది. 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా అందిస్తుంది.
ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ దాని మునుపటి సిరీస్ కంటే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను పొందింది. ఇందులో డైనమిక్ ఐలాండ్ సౌకర్యం కూడా ఉంది. ఇందులో వైర్‌లెస్ కనెక్టివిటీ సౌకర్యం వస్తుంది. ఫోన్‌లో రోడ్‌సైడ్ అసిస్టెంట్, వయా శాటిలైట్స్ వంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ సేల్‌లో ఐఫోన్ తక్కువ ధరలో కొనొచ్చు.