Smart TV Discount : భారీ డిస్కౌంట్‌తో 43 అంగుళాల ఎల్జీ స్మార్ట్ టీవీ.. అంతేకాదు కూపన్, ఈఎంఐ ఆప్షన్ కూడా
LG Smart TV Discount : తక్కువ ధరలో స్మార్ట్ టీవీ కొనుక్కోవాలని చూస్తున్నవారికి శుభవార్త. 43 అంగుళాల ఎల్జీ స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి.
మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే మీ కోసం సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలో ఎల్జీ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు. దాదాపు 40 శాతం వరకు మీకు తగ్గింపు లభిస్తుంది. దీనిపై బ్యాంక్, కూపన్ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఆఫర్ గురించి తెలుసుకుందాం..
కొత్త సంవత్సరానికి ముందు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఎల్జీ 43 అంగుళాల స్క్రీన్ సైజ్ మోడల్‌ను ప్రత్యేక తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. డిస్‌ప్లే తయారీలో టాప్ టెక్ బ్రాండ్లలో ఒకటిగా ఉన్న అతికొద్దింటిలో ఎల్జీ ఒకటి. వెబ్ఓఎస్‌ను ఎల్జీ తన భారీ డిస్‌ప్లే టీవీలలో అందిస్తోంది. ఐదేళ్ల వరకు గ్యారెంటీ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
43 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉన్న ఎల్జీ స్మార్ట్ టీవీలపై భారీ ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ ప్రీమియం బిల్డ్-క్వాలిటీని అందిస్తుంది. బెజెల్-లెస్ డిజైన్‌ను అందిస్తోంది. ఏఐ బ్రైట్‌నెస్, ఏఐ సౌండ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఆఫర్ వివరాలు
ఎల్జీ స్మార్ట్ టీవీ 43 అంగుళాల స్క్రీన్ సైజ్ మోడల్ అసలు ధర రూ.49,990 వరకు ఉండగా, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్‌లో లిమిటెడ్ టైమ్ డీల్ కింద రూ.29,990కు లిస్ట్ అయింది. అంటే ఈ ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది. అలాగే ఈ టీవీపై రూ .1000 కూపన్ డిస్కౌంట్ కూడా ఇవ్వబడింది.
కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు సాయంతో పేమెంట్ చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్ల కారణంగా ఎల్జీ స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.27,990కు మాత్రమే దొరుకుతుంది. అంతేకాదు.. మీరు ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నెలకు రూ.1,454గా ఉంది.
ఫీచర్లు
ఎల్జీ స్మార్ట్ టీవీలో 43 అంగుళాల స్క్రీన్ సైజ్ 4కే డిస్‌ప్లే, బిల్ట్-ఇన్ వైఫైతో పాటు రెండు యూఎస్బీ పోర్టులతో పాటు ఇతర కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మంచి సౌండ్ అవుట్ పుట్ కోసం 20 వాట్ల సామర్థ్యంతో 2.0 ఛానల్ స్పీకర్లను కలిగి ఉంది. వీటితో పాటు ఏఐ సౌండ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. మిగిలిన స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో వెబ్ఓఎస్ స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్ స్కీన్, ఏఐ థిన్క్యూ సపోర్ట్ లభిస్తుంది.