Gautam Adani : రిచ్చెస్ట్​ ఏషియన్​గా గౌతమ్​ అదానీ- ముకేశ్​ అంబానీని మళ్లీ వెనక్కి నెట్టి..-gautam adani replaces mukesh ambani as richest asian ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gautam Adani : రిచ్చెస్ట్​ ఏషియన్​గా గౌతమ్​ అదానీ- ముకేశ్​ అంబానీని మళ్లీ వెనక్కి నెట్టి..

Gautam Adani : రిచ్చెస్ట్​ ఏషియన్​గా గౌతమ్​ అదానీ- ముకేశ్​ అంబానీని మళ్లీ వెనక్కి నెట్టి..

Sharath Chitturi HT Telugu
Jun 02, 2024 01:20 PM IST

Asia's richest person : రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీని మరోమారు వెనక్కి నెట్టి.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు అదానీ గ్రూప్​ ఓనర్​ గౌతమ్​ అదానీ. ప్రపంచ బిలియనీర్స్​ జాబితాలో ఆయన స్థానం ఎంతంటే..

ముకేశ్​ అంబానీ- గౌతమ్​ అదానీ..
ముకేశ్​ అంబానీ- గౌతమ్​ అదానీ.. (File)

Gautam Adani net worth : బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. బిలియనీర్ గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ మేరకు.. మరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించారు.

yearly horoscope entry point

ఈ ఇండెక్స్ ప్రకారం.. అదానీ ఇప్పుడు 111 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోని కుబేరుల జాబితాలో 11వ స్థానంలో ఉండగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ.. 109 బిలియన్ డాలర్ల నికర విలువతో 12వ స్థానంలో ఉన్నారు.

గౌతమ్​ అదానీ.. మళ్లీ ఏషియన్​ రిచ్చెస్ట్​ పర్సన్​గా మారడానికి కారణం.. శుక్రవారం అదానీ స్టాక్స్​లో భారీగా ర్యాలీ అవ్వడమే. దాదాపు అన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు శుక్రవారం 14% వరకు పెరిగాయి. మార్కెట్ విలువ రూ.84,064 కోట్లు పెరగడంతో శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17.51 లక్షల కోట్లకు చేరింది. ఫలితంగా.. ముకేశ్​ అంబానీని అదానీ వెనక్కి నెట్టి, ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచారు.

Gautam Adani Asia's richest person : 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ అదానీ వ్యక్తిగత సంపద పెరగడంతో.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. కానీ జనవరి 2023లో, ప్రముఖ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్​ స్టాక్స్​లో భారీ పతనం కనిపించింది.

అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని మోసాల ద్వారా నిర్మించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా.. అదానీ గ్రూప్ స్టాక్ ధరలు 150 బిలియన్ డాలర్ల కనిష్ట స్థాయికి పడిపోయాయని, ప్రపంచంలోని టాప్ 20 బిలియనీర్లలో ఆయన చోటు కోల్పోయారని నివేదికలు పేర్కొన్నాయి. కానీ ఏడాదిన్నరకే.. కోల్పోయినదాని కన్నా ఎక్కువ సంపాదించడం విశేషం.

Gautam Adani news : హిండెన్బర్గ్​ ఆరోపణలను గతంలో అదానీ ఖండించారు. రుణాలను నియంత్రించడం, వ్యవస్థాపక వాటా ప్రతిజ్ఞను తగ్గించడం, ప్రధాన సామర్థ్యాలలో వ్యాపారాన్ని ఏకీకృతం చేయడం వంటి పునరాగమన వ్యూహంపై పనిచేశారు. ఇది క్లిక్​ అయ్యింది.

2024లో ఇప్పటివరకు అదానీ నికర విలువ 26.8 బిలియన్ డాలర్లు పెరగ్గా, అంబానీ సంపద 12.7 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగిందని బ్లూమ్​బర్గ్ ఇండెక్స్ తెలిపింది.

61ఏళ్ల బిలియనీర్.. వజ్రాల పరిశ్రమలో తన కెరీర్​ని ప్రారంభించారు. 1988లో తన సొంత సంస్థను స్థాపించారు. ఇది కమోడిటీస్ రంగంలో దిగుమతి-ఎగుమతి కార్యకలాపాలుగా ప్రారంభమైంది. క్రమంగా ఇతర కార్యక్రమాలకు విస్తరించింది.

Gautam Adani Mukesh Ambani : 2014లో 5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద.. 2022 చివరి నాటికి 12,100 కోట్ల డాలర్లకు పెరిగింది. 2022 సెప్టెంబర్ నాటికి ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా కూడా అవతరించారు!

గ్రూప్ కంపెనీల వార్షిక నివేదికల్లో.. గ్రూప్ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేశారు గౌతమ్​ అదానీ. "ముందున్న మార్గం అసాధారణ అవకాశాలతో నిండి ఉంది. అదానీ గ్రూప్ గతంలో కంటే ఈ రోజు మరింత బలంగా ఉందని నేను మీకు హామీ ఇవ్వగలను," అని చెప్పారు గౌతమ్​ అదానీ.

Whats_app_banner

సంబంధిత కథనం