Samsung Galaxy S23 launch today: సామ్‍సంగ్ లాంచ్ ఈవెంట్ నేడే.. మూడు ఫ్లాగ్‍షిప్‍ ఫోన్‍లు: టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు-galaxy unpacked 2023 event today samsung galaxy s23 series set to launch know timings live streaming details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Galaxy Unpacked 2023 Event Today Samsung Galaxy S23 Series Set To Launch Know Timings Live Streaming Details

Samsung Galaxy S23 launch today: సామ్‍సంగ్ లాంచ్ ఈవెంట్ నేడే.. మూడు ఫ్లాగ్‍షిప్‍ ఫోన్‍లు: టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 01, 2023 10:45 AM IST

Samsung Galaxy S23 Serials: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ నేడు లాంచ్ కానుంది. అన్‍ప్యాక్డ్ 2023 (Unpacked 2023) ఈవెంట్ ద్వారా ఈ ఫోన్‍లను విడుదల చేయనుంది సామ్‍సంగ్.

Samsung Galaxy S23 launch today: సామ్‍సంగ్ లాంచ్ ఈవెంట్ నేడే (Photo Credit: Slashleaks)
Samsung Galaxy S23 launch today: సామ్‍సంగ్ లాంచ్ ఈవెంట్ నేడే (Photo Credit: Slashleaks)

Samsung Galaxy Unpacked 2023 Event: గెలాక్సీ అన్‍ప్యాక్డ్ 2023 ఈవెంట్‍కు సామ్‍సంగ్ సిద్ధమైంది. నేడే (ఫిబ్రవరి 1) ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ (Samsung Galaxy S23 Series) లాంచ్ కానుంది. ఈ సిరీస్‍లో సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), గెలాక్సీ ఎస్23+ (Samsung Galaxy S23+), గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఫోన్లు ఉండనున్నాయి. అలాగే నెక్స్ట్ జనరేషన్ ల్యాప్‍టాప్‍లను కూడా సామ్‍సంగ్ ఈ ఈవెంట్‍లో లాంచ్ చేయనుంది. ఈ గెలాక్సీ అన్‍ప్యాక్డ్ 2023 ఈవెంట్ టైమింగ్స్ ఏంటి.. ఎక్కడ చూడవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

Samsung Galaxy Unpacked 2023 Event: గెలాక్సీ అన్‍ప్యాక్డ్ 2023 లాంచ్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 11.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్ అమెరికాలోని శాన్‍ఫ్రాన్సిస్కో వేదికగా జరగనుంది. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్‍ను సామ్‍సంగ్ అధికారిక వెబ్‍సైట్, సామ్‍సంగ్ యూట్యూబ్ ఛానెల్‍, ఫేస్‍బుక్, ట్విట్టర్ ఖాతాల్లో చూడవచ్చు. భారత్‍లో నేటి రాత్రి 11.30 గంటల నుంచి ఈ ఈవెంట్ లైవ్ వీక్షించవచ్చు.

Galaxy Unpacked 2023 Event: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23), సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23+, సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫ్లాగ్‍షిప్ మొబైళ్లు ఈ గెలాక్సీ అన్‍ప్యాక్డ్ ఈవెంట్‍లో లాంచ్ కానున్నాయి. అలాగే సామ్‍సంగ్ గెలాక్సీ బుక్ 3 ల్యాప్‍టాప్‍లు కూడా ఈవెంట్‍లో అడుగుపెట్టనున్నాయి.

Samsung Galaxy S23 Series: సామ్‍సంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‍ మొబైళ్లు ఫ్లాగ్‍షిప్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 పవర్‌ఫుల్ ప్రాసెసర్ పై రన్ అవుతాయి. గెలాక్సీ ఎస్23 అల్ట్రా (Samsung Galaxy S23 Ultra) ఈ లైనప్‍లో ప్రీమియమ్ టాప్ ఎండ్ మోడల్‍గా ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, క్వాడ్ హెచ్‍డీ డిస్‍ప్లేను కలిగి ఉంటుంది. లాంచ్ ఈవెంట్‍లో ఈ ఫోన్‍ల పూర్తి స్పెసిఫికేషన్లు, ధరలను సామ్‍సంగ్ వెల్లడిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్