WhatsApp features : వాట్సాప్‌లో ఈ 5 ఫీచర్స్ ఎలా వాడాలో మీకు తెలుసా?
WhatsApp features explained : వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ ఫీచర్స్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. అవేంటంటే..!
WhatsApp features explained : ఇప్పుడు దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్స్‌లో కనిపించే కామన్ ఫీచర్స్‌లో ఒకటి వాట్సాప్. ఈ సోషల్ మీడియా యాప్‌ను చాలా మంది వాడుతుంటారు. ఈ మెసేజింగ్ యాప్‌లో వీడియోలు కూడా పంపుకోవచ్చు, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ యాప్‌ను వాడటం చాలా ఈజీ. అందుకే దీనిని వాడేందుకు అందరు ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వాట్సాప్‌కు సంబంధించి కొన్ని ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాము..
ట్రెండింగ్ వార్తలు
డేటా యూసేజ్ ట్రాకింగ్..
వాట్సాప్ ద్వారా మీరు ఎంత డేటా వాడుతున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇలా చేయండి..
స్టెప్ 1:- సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2:- స్టోరేజ్- డేటాపై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- నెట్వర్క్ యూసేజ్ డేటా వివరాలు చెక్ చేసుకోండి.
డెస్క్‌టాప్‌లో వాట్సాప్..
WhatsApp latest features : మొబైల్లోనే కాదు.. డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ను వాడొచ్చని మీకు తెలుసా? చాలా సింపుల్‌గా డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ను యాక్సెస్ చేయవచ్చు.
స్టెప్ 1:- ఫోన్లో వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. లింక్డ్ డివైజ్ ఆప్షన్‌పై క్లిక్ చయండి.
స్టెప్ 2:- లింక్ ఎ డివైజ్‌పై క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
స్టెప్ 3:- ఇప్పుడు డెస్క్‌టాప్‌లో గూగుల్ ఓపెన్ చేసి వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి.
స్టెప్ 4:- ఫోన్లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఓపెన్ అవుతుంది.
ఇదీ చూడండి:- WhatsApp: ఒకే ఫోన్ లో, ఒకే వాట్సాప్ యాప్ లో ఒకటికి మించిన వాట్సాప్ అకౌంట్స్..! ఇకపై సాధ్యమే..
ఛాట్ వాల్‌పేపర్ ఇలా మార్చుకోండి..
వాట్సాప్ ఛాట్స్‌లో వాల్‌పేపర్స్‌ను మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చని తెలుసా?
స్టెప్ 1:- సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
స్టెప్ 2:- ఛాట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ఛాట్ వాల్‌పేపర్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4:- వాల్‌పేపర్ లైబ్రెరీ, గ్యాలరీతో పాటు ఇతర ఆప్షన్స్‌లో నుంచి మీకు నచ్చిన వాల్‌పేపర్‌ను ఎంచుకోండి.
మెసేజ్‌లను మాయం చేయాలా?
వాట్సాప్‌లో వానిష్ మోడ్‌తో మెసేజ్‌లను మాయం చేయొచ్చని మీకు తెలుసా?
స్టెప్ 1:- ఏదైనా ఛాట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2:- సంబంధిత వ్యక్తి పేరుపై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- "డిసప్పియరింగ్ మెసేజెస్" ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 4:- మెసేజ్ టైమర్ సెలక్ట్ చేసుకోండి. అంతే!
మీడియాను కూడా మాయం చేయొచ్చు..!
WhatsApp features latest news : వాట్సాప్‌లో చాలా కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్నాయి. మీరు పంపించే ఫొటోలు, వీడియోలు కూడా డిసప్పియర్ చేసే ఫీచర్ కూడా ఉంది.
స్టెప్ 1:- ఏదైనా ఛాట్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2:- మీరు పంపాలని భావిస్తున్న వీడియో, ఫోట్ను గ్యాలరీ నుంచి పిక్ చేసుకోండి.
స్టెప్ 3:- ఫొటో, వీడియోకు కింది భాగంలో కనిపిస్తున్న "1" బటన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- బ్లూ యారో మీద క్లిక్ చేయండి. మీరు పంపించిన మీడియాను అవతలి వ్యక్తి ఓపెన్ చేసి చూసిన తర్వాత, అది మాయమైపోతుంది.
సంబంధిత కథనం