మే నెలలో దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్.. వీటి పెరుగుదలకు అసలైన కారణాలు!-from apollo micro zen tech to grse 23 defence stocks rally up to 61 percentage in may know the reason for this ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మే నెలలో దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్.. వీటి పెరుగుదలకు అసలైన కారణాలు!

మే నెలలో దూసుకెళ్లిన డిఫెన్స్ స్టాక్స్.. వీటి పెరుగుదలకు అసలైన కారణాలు!

Anand Sai HT Telugu

మే నెలలో రక్షణ రంగం స్టాక్స్ దుమ్మురేపాయి. మంచి లాభాలను తీసుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్ నెలకొంది.

మే నెలలో డిఫెన్స్ స్టాక్స్ (Pixabay)

ార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, పరాస్ డిఫెన్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, సోలార్ ఇండస్ట్రీస్ వంటి డిఫెన్స్ స్టాక్స్ మే నెలలో లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్ల నుండి బలమైన డిమాండ్ కారణంగా రక్షణ రంగం ఈ నెలలో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది.

రక్షణ స్టాక్స్ పెరుగుదలకు కారణాలు

ఆపరేషన్ సింధూర్‌‌తో భారతదేశం తన స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థ బలాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించడంతో సెంటిమెంట్ మరింత బలపడింది.

ఈ కారణాలతోపాటుగా మంచి మార్చి త్రైమాసిక ఆదాయాలు, పెరుగుతున్న ఆర్డర్‌లు, జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని పెంచుతుందనే అంచనాలు, భారతదేశం దేశీయంగా తయారు చేసిన రక్షణ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ ఇవన్నీ మే నెలలో రక్షణ స్టాక్స్‌లో బలమైన పెరుగుదలకు దోహదం చేశాయి.

మార్కెట్ క్యాపిటలైజేషన్‌

ఈ అద్భుతమైన పనితీరు 18 నిఫ్టీ ఇండియా డిఫెన్స్ విభాగాల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను మొదటిసారి రూ .11 లక్షల కోట్ల మార్కును దాటి రూ .11.3 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉండేది.

అపోలో మైక్రో సిస్టమ్స్ భారీ లాభాలు

ఇక అపోలో మైక్రో సిస్టమ్స్ మే ర్యాలీలో డిఫెన్స్ స్టాక్స్‌లో టాప్ పెర్ఫార్మర్‌గా అవతరించింది. ఇది రూ.117 నుంచి రూ.183కు పెరగడంతో 60 శాతానికి పైగా రాబడిని అందించింది. 2023 అక్టోబర్ తర్వాత 62 శాతం రాబడిని నమోదు చేసిన తర్వాత ఇదే అతిపెద్ద నెలవారీ లాభం.

ఈ స్టాక్స్ కూడా

ఐడియాఫోర్జ్ టెక్నాలజీ, డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్, జెన్ టెక్నాలజీస్, రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ సహా డ్రోన్ సంబంధిత షేర్లు 50 శాతం వరకు పెరిగాయి. అదే సమయంలో, షిప్ బిల్డింగ్ స్టాక్స్ కూడా అద్భుతమైన పనితీరును కనబరిచాయి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 57 శాతం, కొచ్చిన్ షిప్ యార్డ్ 23 శాతం లాభపడ్డాయి.

పెరుగుతున్న రక్షణ బడ్జెట్, పెరుగుతున్న ఎగుమతి సామర్థ్యం, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగం స్టాక్స్ దూసుకెళ్తున్నాయి.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు తెలివైన నిర్ణయాలు తీసుకోండి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.