GST council decisions: సినిమా హాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ పై జీఎస్టీ తగ్గింపు సహా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలివే..-from 5 percent to 28 percent gst rates here are key highlights of 50th gst council meeting ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gst Council Decisions: సినిమా హాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ పై జీఎస్టీ తగ్గింపు సహా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలివే..

GST council decisions: సినిమా హాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ పై జీఎస్టీ తగ్గింపు సహా జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలివే..

HT Telugu Desk HT Telugu
Jul 12, 2023 01:56 PM IST

50th GST Council meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆన్ లైన్ గేమ్స్ పై 28% జీఎస్టీ విధింపుతో పాటు పలు వస్తువులపై జీఎస్టీని 18% నుంచి 5 శాతానికి తగ్గించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

50th GST Council meeting: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆన్ లైన్ గేమ్స్ పై 28% జీఎస్టీ విధించాలన్నది ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం. దాంతోపాటు పలు వస్తువులపై జీఎస్టీని 18% నుంచి 5 శాతానికి తగ్గించారు. సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి, రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తదితరులు పాల్గొన్నారు.

5% GST: సినిమా హాల్స్ లో ఫుడ్ ఐటమ్స్ పై జీఎస్టీ తగ్గింపు

సినిమా ప్రేక్షకులకు ఈ సారి జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త తెలిపింది. సినిమాహాల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్ధాలపై జీఎస్టీ ని 18% నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల సినిమా హాల్స్ లో సర్వ్ చేసే ఆహార పదార్ధాల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. దిగుమతి చేసుకునే పలు ఫార్మా ఉత్పత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపును ఇచ్చారు. అలాగే, ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్ లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. ఇది కొంతవరకు ఆన్ లైన్ గేమింగ్ సంస్థలకు భారీ దెబ్బగానే భావించవచ్చు. ఆన్ లైన్ గేమ్స్ కు గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ చాన్స్ (game of skill and chance) కేటగిరీ నుంచి తొలగించారు. ఆన్ లైన్ గేమ్స్ లో పెట్టే బెటింగ్స్ కు ఈ 28% జీఎస్టీ వర్తిస్తుంది. అలాగే, కేసినోలలో కొనుగోలు చేసే చిప్స్ (chips) లేదా కాయిన్స్ (coins) కు కూడా ఈ 28% జీఎస్టీ వర్తిస్తుంది.

No GST on cancer treatment medicines: కేన్సర్ ఔషధాలపై జీఎస్టీ తొలగింపు

కేన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు, ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు వాడే మందులు, ప్రత్యేక వైద్య అవసరాల కోసం వినియోగించే ఆహారోత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా తొలగించారు. కేన్సర్, ఇతర అరుదైన దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తుల మెడిసిన్స్ ఖర్చు ఈ నిర్ణయంతో గణనీయంగా తగ్గనుంది. 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా నిర్మల సీతారామన్ 'GST Council - 50 steps towards a journey' పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేశారు.

5% GST: నాలుగు వస్తువులపై ఇకపై 5 శాతమే జీఎస్టీ

మరో నాలుగు వస్తువులను 5% పన్ను పరిధిలోకి తీసుకువస్తూ ఈ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వండని, ఫ్రై చేయని స్నాక్స్ ప్యాకెట్స్, ఫిష్ సాల్యుబుల్ పేస్ట్, ఉక్కు ఉత్పత్తి సమయంలో తయారయ్యే వ్యర్థం ఎల్డీ స్లాగ్ (LD slag), ఇమిటేషన్ జరీ దారం.. ఈ నాలుగు వస్తువులపై ఇకపై జీఎస్టీ 5% మాత్రమే ఉంటుంది. అలాగే, ఉపగ్రహ పరీక్షలకు సంబంధించి ఇస్రో, యాంత్రిక్స్, ఎన్ఎస్ఐఎల్ తదితర సంస్థలు అందించే సేవలపై కూడా జీఎస్టీని మినహాయించారు. ఈ రంగంలో స్టార్ట్ అప్ లను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Whats_app_banner