Netflix Subscription : ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రీఛార్జ్ చేసుకుంటే చాలు
Netflix Subscription : ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కావాలనుకుంటే పలు రీఛార్జ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఉచిత ఓటీటీ ప్రయోజనాన్ని అందించే రీఛార్జ్ ప్లాన్ల లిస్ట్ చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే చాలా మంది ఆలోచిస్తారు. ప్రత్యేకంగా దీని కోసం డబ్బులు పెట్టడం ఎందుకు అనుకుంటారు. అయితే నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వచ్చే కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. కొన్ని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. రీఛార్జ్ చేస్తే ఈ ఓటీటీ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఆ రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఓసారి చూద్దాం..

జియో రూ.1299 ప్లాన్
రిలయన్స్ జియో రూ.1299 రీచార్జ్ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపవచ్చు. నెట్‌ఫ్లిక్స్(మొబైల్) సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ చెల్లుబాటు కాలానికి అందుబాటులో ఉంటుంది.
జియో రూ.1799 ప్లాన్
యూజర్లకు రోజుకు 3 జీబీ డేటా కావాలంటే ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్లు లభిస్తాయి. జియో యాప్స్ యాక్సెస్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్(బేసిక్) సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నారు.
ఎయిర్‌టెల్ రూ .1798 ప్లాన్
ఎయిర్‌టెల్ చందాదారులకు ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లతో ఉచిత కాలింగ్ చేయవచ్చు. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్, అపోలో 24/7కు కూడా యాక్సెస్ లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా(విఐ) రూ .1198 ప్లాన్
విఐ వినియోగదారులు రూ .1198 ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే 70 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. రోజుకు 2జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్(బేసిక్) సబ్‌స్క్రిప్షన్‌తో రాత్రిపూట అపరిమిత డేటా, వారాంతపు డేటా రోల్ఓవర్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది.