SIP 7531 Rule : సిప్‌లో పెట్టుబడి పెట్టి ఈ 7531 రూల్ పాటిస్తే మీకు తిరుగే ఉండదు.. మంచి రాబడులు!
SIP 7531 Rule : సిప్‌లో పెట్టుబడి పెడితే సరిపోదు. చాలా ఓపిక ఉండాలి. 7531 రూల్ పాటిస్తే మీకు మంచి రాబడులు వస్తాయి. ఆ రూల్ గురించి తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్ సిప్‌లో పెట్టుబడి గురించి ఇటీవలి కాలంలో ఎక్కువ జనాలు మాట్లాడుకుంటున్నారు. చాలా మంది తమ ఆదాయాన్ని సిప్‌లలోకి మళ్లిస్తున్నారు. దీనికి కారణం భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయనే ఆశ. అందుకే పెట్టుబడిదారులలో సిప్ చాలా ప్రసిద్ధి చెందింది. మంచి రాబడుల కోసం ప్రతి ఒక్కరూ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే సిప్‌లో పెట్టుబడి పెట్టి డబ్బులు ఎప్పుడు బయటకు తీద్దామా అని చూస్తే ఉపయోగం లేదు. మీరు తప్పకుండా 7531 రూల్ పాటించాలి.
ఈ రూల్‌లో మెుదటి విషయానికొస్తే 7.. అంటే మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ కాలం ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు కనీసం 7 సంవత్సరాలు మార్కెట్‌లో ఉండాలి. దీనికి కూడా కారణం ఉంది. మార్కెట్ ఒడిదొడుకుల సమయంలో వచ్చే నష్టాలను సగటున ఈక్విటీలు ఏడేళ్ల వ్యవధిలో బాగా పనిచేస్తాయని గత డేటా విశ్లేషణ చూపిస్తుంది. కనీసం ఏడు సంవత్సరాల పాటు SIPలలో పెట్టుబడి పెట్టడం వలన నష్టాలు ఉండవని, మంచి రాబడులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ నియమంలోని 5 మీరు మంచి నాణ్యత గల ఫండ్‌లపై ఇన్వెస్ట్ చేయాలి. 5 అనేది సిప్ మొత్తాన్ని ఐదు విభిన్న రకాల ఆస్తుల తరగతులుగా వైవిధ్యపరచడాన్ని సూచిస్తుంది. ఇది విలువ, నాణ్యత, గ్లోబల్ ఎక్స్‌పోజర్, ధర, వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటుంది. ఒక నిర్దిష్ట రకం మీదనే ఆధారపడకూడదని ఈ రూల్ చెబుతుంది. మీరు పెట్టుబడి పెట్టో సిప్‌కు సంబంధించి ఎన్ఎఫ్ఓ వృద్ధి, ట్రాక్ రికార్డ్, గత పనితీరును తనిఖీ చేయాలి.
3 అంకే మీరు మానసికంగా మూడు విషయాల్లో సిద్ధంగా ఉండాలని చెబుతుంది. ఈ మూడు దశలు ఎప్పుడైనా రావచ్చు. అవి'ఇరిటేషన్ ఫేజ్,' 'పానిక్ ఫేజ్,' 'డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్'. మొదటి దశలో పెట్టుబడిదారుడు తక్కువ రాబడిని ఎదుర్కోవచ్చు. పానిక్ ఫేజ్‌లో ప్రతికూల రాబడిని కూడా చూడవచ్చు. డిసప్పాయింట్‌మెంట్ ఫేజ్‌లో ఇతర పెట్టుబడులకంటే తక్కువ రాబడి రావొచ్చు. అంటే ఎఫ్‌డీ కంటే తక్కువగా కూడా ఉండొచ్చు అనే మూడు విషయాలకు మానసికంగా సిద్ధంగా ఉండాలి.
ఇందులో 1 విషయానికొస్తే.. మీరు ప్రతి సంవత్సరం మీ సిప్‌ని 10 శాతం పెంచుకోవాలి. ఇది మీ పెట్టుబడి, రాబడి రెండింటినీ పెంచుతుంది. కార్పస్ పెరగాలంటే కచ్చితంగా ప్రతీ ఏటా సిప్ పెంచండి.