అధునాతన హింజ్ టెక్నాలజీ, క్రీజ్ ఫ్రీ డిస్ ప్లే తో త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్-foldable iphone may launch soon with crease free display new hinge tech ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అధునాతన హింజ్ టెక్నాలజీ, క్రీజ్ ఫ్రీ డిస్ ప్లే తో త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్

అధునాతన హింజ్ టెక్నాలజీ, క్రీజ్ ఫ్రీ డిస్ ప్లే తో త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్

Sudarshan V HT Telugu

ఆపిల్ ఐఫోన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ విషయంలో ప్రత్యర్థుల కన్నా కొంత వెనుకబడి ఉంది. శాంసంగ్ ఇప్పటికే పలు ఫోల్డబుల్ మోడల్స్ ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో, అధునాతన హింజ్ టెక్నాలజీ, క్రీజ్ ఫ్రీ డిస్ ప్లే తో ఆపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.

ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ (REUTERS)

కొన్నేళ్లుగా కంపెనీ ప్రణాళికలను ఆలస్యం చేస్తుండటంతో ఫోల్డబుల్ ఐఫోన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు. అయితే, ఆపిల్ తాజాగా తమ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ప్రణాళికలను వేగవంతం చేసింది. పోల్డబుల్ ఐఫోన్ వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కాలంగా, క్రీజ్-ఫ్రీ డిస్ప్లేను తీసుకురావడంలో కంపెనీ ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా ఫోల్డబుల్ ఐఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రణాళికలలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ కోసం క్రీజ్-ఫ్రీ డిస్ప్లే, అధునాతన హింజ్ టెక్నాలజీలను సిద్ధం చేస్తోంది.

ఫోల్డబుల్ ఐఫోన్ సమాచారం

ఫోల్డబుల్ టెక్నాలజీలో మరింత పురోగతితో ఆపిల్ త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్ ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ గురించి మరిన్ని లీకులు ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభించాయి. ఇప్పుడు, తాజా బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే ఫోల్డబుల్ ఐఫోన్ లో రెండు ప్రధాన పురోగతులు ఉంటాయి. ఇవి పోటీదారుల నుండి భిన్నంగా ఉంటుంది. అవి

క్రీజ్-ఫ్రీ డిస్ప్లే

ఆపిల్ క్రీజ్-ఫ్రీ డిస్ప్లేను అమర్చినందున, రానున్న ఫోల్డబుల్ ఐఫోన్ లో క్రీజ్ "దాదాపు కనిపించదు’’. "ఫోన్ ఓపెన్ పొజిషన్ లో ఉన్నప్పుడు క్రీజ్ కనిపించకుండా చేయడం ద్వారా ఆపిల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పోటీలో దూసుకురావాలని చూస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్ 7.8 అంగుళాల లేదా 8 అంగుళాల ప్రధాన ఫోల్డబుల్ డిస్ ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది పోటీదారులతో పోలిస్తే మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది.

హింజ్ టెక్నాలజీ

క్రీజ్-ఫ్రీ డిస్ప్లేతో పాటు, ఫోల్డబుల్ ఐఫోన్ లో ఆపిల్ "అధిక-నాణ్యత గల హింజ్" ను తీసుకురానున్నట్లు సమాచారం. హింజ్ కోసం టైటానియం, స్టెయిన్లెస్ స్టీల్ కలయికను ఆపిల్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఫోల్డబుల్ ఐఫోన్ క్లోజ్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు 4.5 మిమీ, ఓపెన్ పొజిషన్ లో ఉన్నప్పుడు సుమారు 9.5 మిమీ మందంగా ఉంటుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం