Flipkart Valentine day sale: ఫ్లిప్ కార్ట్ లో వేలంటైన్ డే సేల్; క్రేజీ డీల్స్..-flipkart valentine mobile bonana sale deals on iphone 13 pixel 7 and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Valentine Mobile Bonana Sale: Deals On Iphone 13, Pixel 7 And More

Flipkart Valentine day sale: ఫ్లిప్ కార్ట్ లో వేలంటైన్ డే సేల్; క్రేజీ డీల్స్..

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 05:17 PM IST

ప్రేమికుల దినోత్సవం (Valentine day) సందర్భంగా ఫ్లిప్ కార్ట్ (Flipkart) మొబైల్ బొనాంజా సేల్ (Mobile Bonanza sale) పేరుతో స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, ప్రేమికులు గిఫ్ట్స్ గా ఇచ్చుకోవడానికి వీలుగా పలు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ ను ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఆఫర్ చేస్తోంది. ఈ వేలంటైన్స్ డే స్పెషల్ మొబైల్ బొనాంజా సేల్ (Valentine day Mobile Bonanza sale) ఫిబ్రవరి 15వ తేదీన ముగుస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Flipkart sale ఈ ఫోన్స్ పై మంచి ఆఫర్లు..

ఫ్లిప్ కార్ట్ (Flipkart) వేలంటైన్స్ డే స్పెషల్ మొబైల్ బొనాంజా సేల్ (Valentine day Mobile Bonanza sale)లో నథింగ్ ఫోన్ (Nothing Phone 1), ఐ ఫోన్ 13 (iPhone 13), సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE), తదితర ఫోన్లపై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ వేలంటైన్ కు స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇదే రైట్ టైమ్.

ఐ ఫోన్ 13 (iPhone 13)

ఐ ఫోన్ 13 (iPhone 13) ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 60 వేల లోపే లభిస్తోంది. సేల్ లో భాగంగా ఈ ఐ ఫోన్ 13 (iPhone 13) ధరను రూ. 61,999 గా ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. కానీ, రూ. 2 వేల వరకు లభించే బ్యాంక్ డిస్కౌంట్ అనంతరం ఐ ఫోన్ 13 (iPhone 13) రూ. 59,999 కే లభిస్తుంది.

సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE)

8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (8GB RAM with 128GB storage) తో వచ్చిన సామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ (Samsung Galaxy S21 FE) ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 34,999 లకు లభిస్తుంది. కస్టమర్లు రూ. 20 వేల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 7 (Pixel 7)

గూగుల్ నుంచి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (8GB RAM with 128GB storage) తో వచ్చిన స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 7 (Pixel 7). ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 56,999 కి పొందవచ్చు. అలాగే, కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 21 వేల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ పొందవచ్చు. ఇందులో Google Tensor G2 ప్రాసెసర్ ను అమర్చారు.

నథింగ్ ఫోన్ (Nothing Phone 1)

ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఈ నథింగ్ ఫోన్ (Nothing Phone 1) ను రూ. 27,999 కు పొందవచ్చు. ఈ ధరకు 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ (8GB RAM with 256GB storage) వేరియంట్ లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ (Flipkart Axis Bank card) తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ (cashback) లభిస్తుంది. ఈ ఫోన్ లో 6.55 అంగుళాల ఫుల్ హెడ్ డీ డిస్ ప్లే (6.55-inch Full HD+ display) ఉంటుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్ (Qualcomm Snapdragon 778G+ processor) ను అమర్చారు.

మోటొరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ (MOTOROLA Edge 30 Fusion)

మోటొరోలా నుంచి వచ్చిన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 39,999 కి లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ (Flipkart Axis Bank card) తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ (cashback) లభిస్తుంది. ఈ ఫోన్ లో 6.55 అంగుళాల ఫుల్ హెడ్ డీ డిస్ ప్లే (6.55-inch Full HD+ display) ఉంటుంది. ఇందులో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888జీ ప్లస్ ప్రాసెసర్ (Qualcomm Snapdragon 888G+ processor) ను అమర్చారు.

WhatsApp channel