మే 1 నుంచి మే 8, 2025 వరకు జరగనున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో భాగంగా పోకో తన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఫ్లాగ్షిప్ ఎక్స్7 సిరీస్, పర్ఫార్మెన్స్ ఆధారిత ఎం7 సిరీస్, సరసమైన సీ సిరీస్ సహా పోకో లైనప్ నుంచి వివిధ రకాల గ్యాడ్జెట్స్ ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయి. మీరు ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లేదా బడ్జెట్ డివైజ్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్ అవ్వొచ్చు! ఈ నేపథ్యంలో పోకో స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలను ఇక్కడ చూసేయండి..
పోకో ఎక్స్7, పోకో ఎక్స్7 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాల్లో ముందంజలో ఉంది. పోకో ఎక్స్7లో 1.5కే అమోలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్సెట్, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఇది 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి -600 కెమెరాను కలిగి ఉంది. ఇది నమ్మదగినస స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు అనువైన ఎంపిక అవుతుంది.
పోకో ఎక్స్7 ప్రో 6550 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్‌తో మరింత పవర్‌ని అందిస్తుంది. ఇది గేమర్లకు అంతరాయం లేని పనితీరును నిర్ధారిస్తుంది. ఏఐ స్మార్ట్ క్లిప్, ఏఐ నైట్ మోడ్, ఏఐ స్కైతో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీసే సామర్థ్యాన్ని అందిస్తుంది.
పోకో ఎం7, పోకో ఎం7 ప్రోలతో కూడిన ఎం7 సిరీస్ అద్భుతమైన పనితీరును, డబ్బుకు విలువను అందిస్తుంది. 12 జీబీ ర్యామ్, 6.88 అంగుళాల డిస్ప్లే, 50 ఎంపీ సోనీ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీతో పోకో ఎం7 ప్రత్యేకత సంతరించుకుంది.
పోకో ఎం7 ప్రోలో ప్రకాశవంతమైన అమోలెడ్ డిస్ప్లే, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-600 కెమెరా, 5110 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ రెండు ఫోన్లు 5జీ కనెక్టివిటీని అందిస్తాయి.
పోకో సీ71లో 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ ఐ ప్రొటెక్షన్‌తో 6.88 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేని అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్, 12 జీబీ డైనమిక్ ర్యామ్ ఇందులో ఉన్నాయి. ప్రీమియం గోల్డెన్ రింగ్ కెమెరా డెకో, స్లిమ్ బాడీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూపొందించారు.
5జీ డ్యూయెల్ 5జీ సిమ్ సపోర్ట్, 50 ఎంపీ సోనీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో పోకో సీ75 పనిచేస్తుంది. ఇందులో 6.88 ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5160 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎర్గోనామిక్ డిజైన్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ 52 స్ల్పాష్ రెసిస్టెన్స్‌ను కూడా అందిస్తుంది.
పోకో ఎక్స్7 ప్రో, సీ75, సీ71, ఎఫ్6, ఎం6 ప్లస్‌పై డిస్కౌంట్లను ఏప్రిల్ 29న వెల్లడిస్తారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీంతో వినియోగదారులు ఈ స్మార్ట్ఫోన్లను మంచి ధరలకు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
సంబంధిత కథనం