Flipkart Big Saving Days sale: 40 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే-flipkart big saving days sale deals on smart tvs under 40 000 rupees ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Flipkart Big Saving Days Sale: Deals On Smart Tvs Under 40,000 Rupees

Flipkart Big Saving Days sale: 40 వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

HT Telugu Desk HT Telugu
Dec 17, 2022 10:17 PM IST

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్(Flipkart)లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్(Big Saving Days) నడుస్తోంది. అన్ని స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్, కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాఫన్ అప్పారెల్.. ఇలా దాదాపు అన్ని వస్తువులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఫ్లిప్ కార్ట్(Flipkart)లో బిగ్ సేవింగ్స్ డేస్ సేల్(Big Saving Days) ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు ఉన్నాయి. ఖరీదైన మంచి స్మార్ట్ టీవీని డిస్కౌంట్ లో రూ. 40 వేల లోపు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్స్ ను ఒకసారి చూడండి..

ట్రెండింగ్ వార్తలు

Mi X Series Smart Android TV : ఎంఐ ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

ఈ ఎంఐ ఎక్స్ సిరీస్ అల్ట్రా హెచ్ డీ(4K) ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ(Mi X Series Ultra HD (4K) LED Smart Android TV) ఫ్లిప్ కార్ట్ సేల్ లో 43, 50, 55 ఇంచ్ ల సైజుల్లో లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డిస్ ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. 30 వాట్ సౌండ్ సిస్టమ్ ను పొందుపర్చారు. ఇందులో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ లు ఉన్నాయి. 50 ఇంచ్ ల ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ. 32,999 కి లభిస్తుంది. ఇతర ఆఫర్లు అదనం.

Nokia Smart Android TV: నోకియా ఆండ్రాయిడ్ టీవీ

ఫ్లిప్ కార్ట్ సేల్ లో 55 అంగుళాల ఈ Nokia 139 cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV రూ. 34,999 కి లభిస్తుంది. ఈ టీవీలో Ultra HD 4K LED display ఉంది. ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ నెట్ ఫ్లిక్స్, ఆమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్, యూట్యూబ్ సహ పలు ఓటీటీ యాప్ లను సపోర్ట్ చేస్తుంది.

OnePlus Y1S Pro : వన్ ప్లస్ వై 1ఎస్ ప్రొ

ప్రముఖ చైనీస్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వచ్చిన టీవీ ఇది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ సేల్ లో 55 అంగుళాల ఈ మోడల్ టీవీ రూ. 39,999కి లభిస్తుంది. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ తో 55 ఇంచ్ అల్ట్రా హెచ్ డీ 4కే ఎల్ ఈడీ డిస్ ప్లే ఉంది. 24 వాట్ డోల్బీ ఆట్మాస్ సౌండ్ ఔట్ పుట్ ను ఇస్తుంది. దాదాపు అన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను సపోర్ట్ చేస్తుంది.

Samsung Crystal 4K Neo: స్యామ్సంగ్ క్రిస్టల్ 4 కే నియో

స్యామ్సంగ్ క్రిస్టల్ 4 కే నియో(Samsung Crystal 4K Neo) సిరీస్ కు చెందిన స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లలో లభిస్తున్నాయి. ఈ సిరీస్ లో 43, 50, 55, 58, 65 ఇంచ్ ల స్క్రీన్ సైజులతో స్మార్ట్ టీవీలు లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ సేల్ లో ఈ సిరీస్ కు చెందిన 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ. 31,999 లకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 3840 x 2160 పిక్సెల్ రిజొల్యూషన్ తో, 50Hz రిఫ్రెష్ రేట్ తో , 4K FE UHD displayతో వస్తోంది. ఇది స్యామ్సంగ్ అధీకృత టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది.

WhatsApp channel

టాపిక్