Flipkart Big Saving Days sale: మే 5 నుంచి ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్స్ డేస్ సేల్’
Flipkart Big Saving Days sale: దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale) ను మరోసారి ప్రారంభిస్తోంది. మే 5 వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది.
Flipkart Big Saving Days sale: దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Big Saving Days sale) ను మరోసారి ప్రారంభిస్తోంది. మే 5 వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఈ సేల్ ఉంటుంది. ఈ సేల్ సందర్భంగా ఐ ఫోన్ 13 సహా పలు స్మార్ట్ ఫోన్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్స్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
Flipkart Big Saving Days sale: ఆరు రోజుల పాటు సేల్
ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale) మే 5వ తేదీ నుంచి మే 10 వ తేదీ వరకు, అంటే ఆరు రోజులు కొనసాగుతుంది. ఈ సేల్ లో గూగుల్ పిక్సెల్ 6ఏ (Pixel 6a), రియల్ మి జీటీ నియో 3 టీ (Realme GT Neo 3T) తదితర ఫోన్స్ ఊహించనంత తక్కువ ధరకే లభిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ 6ఏ (Pixel 6a) రూ. 25,999 లకు, రియల్ మి జీటీ నియో 3 టీ (Realme GT Neo 3T) స్మార్ట్ ఫోన్ రూ. 19,999 లకు, పొకొ ఎక్స్5 ప్రొ (Poco X5 Pro) ఫోన్ రూ. 20,999 లకు ఈ సేల్ లో లభిస్తాయి. అలాగే ఐ ఫోన్ 13 (iPhone 13), సామ్సంగ్ ఎఫ్ 14 5జీ (Samsung Galaxy F14 5G), రియల్ మి సీ 55(Realme C55) ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్లకు లభిస్తాయి. ప్రస్తుతం ఐ ఫోన్ 13 ధర ఫ్లిప్ కార్ట్ లో రూ. 61,999 ల ప్రారంభ ధరకు లభిస్తుంది. సేల్ లో ఈ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. సేల్ లో డిస్కౌంట్ కు అందుబాటులో ఉండే ఫోన్ల ధరలను ఫ్లిప్ కార్ట్ మే 1 న వెల్లడించే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Saving Days sale) లో డిస్కౌంట్స్ తో పాటు బ్యాంక్ డిస్కౌంట్స్ (bank offers), క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్ చేంజ్ ఆఫర్స్ (exchange offers) అదనం.