Flipkart Big Billion Days sale: బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్..
Flipkart Big Billion Days sale: పండుగ సీజన్ దగ్గర పడుతుండడంతో మేజర్ ఈ కామర్స్ సైట్స్ భారీగా డిస్కౌంట్స్ తో సేల్స్ ను ప్రకటించాయి. ఫ్లిప్ కార్ట్ కూడా అక్టోబర్ 8వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ ను ప్రారంభిస్తోంది.
Flipkart Big Billion Days sale: అక్టోబర్ 8వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇతర ప్రొడక్ట్స్ తో పాటు స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్స్ ను ఆఫర్ చేస్తోంది. వాటిలో సామ్సంగ్ ఎఫ్13, ఒప్పొ ఏ 17కే, రియల్ మి సీ 55 తదితర ప్రీమియం బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి.
Samsung Galaxy F13. సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్13
ఈ స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 5తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్ డీ + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో ఎక్సినాస్ 850 ప్రాసెసర్‌తో పాటు 8 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 6000 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ధర రూ.14999 కాగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో దీన్ని కేవలం రూ. 9199 లకే పొందవచ్చు. అంటే దాదాపు 38 శాతం తగ్గింపు.
Oppo A17k: ఒప్పొ ఏ 17 కే
ఇది 6.56-అంగుళాల హెచ్ డీ + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో పీ 35 ప్రాసెసర్ ను పొందు పర్చారు. ఇది 8 MP AI ప్రధాన కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇందులోని ర్యామ్ ను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ధర రూ.12999. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో దీన్ని కేవలం రూ. 8999 లకే పొందవచ్చు. అంటే దాదాపు 30 శాతం తగ్గింపు.
Realme C55: రియల్ మి సీ 55
ఈ స్మార్ట్‌ఫోన్ 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ హెచ్ డీ + డిస్‌ప్లే తో వచ్చింది. ఇందులో 64 ఎంపీ AI కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో హీలియో జీ 88 ప్రాసెసర్ ను అమర్చారు. ఇది 16 జీబీ డైనమిక్ ర్యామ్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 33 వాట్ SUPEVOOC ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ధర రూ.12999. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో దీన్ని కేవలం రూ. 9999 లకే పొందవచ్చు.
Motorola G32: మొటొరోలా జీ 32
ఇది 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్ డీ + డిస్‌ప్లే తో వచ్చింది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో కూడిన ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ను అమర్చారు ఇందులో 5000 ఎంఏహెచ్ లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ధర రూ.18999. కానీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీన్ని రూ. 9999 లకి పొందవచ్చు.
టాపిక్