Apple days on Flipkart : కొత్త యాపిల్ ఐఫోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే.. ఇదే సరైన సమయం! దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. యాపిల్ ఐఫోన్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు ఇస్తోంది. యాపిల్ డేస్ సేల్స్‌లో భాగంగా.. ఐఫోన్ 13, ఐఫోన్ 12 మిని, ఐఫోన్ 11పై ఈ ఆఫర్లు ఇస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో.. ఈ నెల 16న మొదలైన ఈ యాపిల్ డేస్ సేల్స్.. ఈ నెల 20 వరకు కొనసాగనుంది.
యాపిల్ డేస్‌లో ఐఫోన్ 12 మినీ.. రూ. 38,999కు లభిస్తోంది. ఈఎంఐ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. నెలకు రూ. 6,666 చెల్లించాలి. ఇక ఐఫోన్ 11.. డిస్కౌంట్ పోను రూ. 39,999కి వస్తోంది.
Flipkart Apple days : మరోవైపు యాపిల్ ఐఫోన్ 13.. రూ. 64,999కి లభిస్తోంది. ఈఎంఐతో అయితే.. నెలకు రూ. 10,834 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను దక్కించుకోవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1500 వరకు డిస్కౌంట్లు కూడా ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్.
ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 17,500 వరకు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్.
iPhone 13 price : ఐఫోన్ 13లో ఏ15 బయోనిక్ చిప్సెట్ ఉంటుంది. 6.1ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే దీని సొంతం. ఇందులో 12ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. రేర్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ దీని సొంతం. రెండూ 12ఎంపీ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ సెన్సార్లే. ఐఓఎస్ 15పై ఈ ఐఫోన్ 13 పనిచేస్తుంది.
iPhone 11 price : ఐఫోన్ 11కు 6.1 ఇంచ్ లిక్విడ్ రెటీనా ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 2మీటర్(30నిమిషాలు) వాటర్ రెసిస్టెన్స్ ఫోన్ ఇది. ఏ13 బయోనిక్ చిప్సెట్ ఇందులో ఉంటుంది. 12ఎంపీ ట్రూడెప్త్ సెల్ఫీ కెమెరా, రేర్‌లో 12ఎంపీ+12ఎంపీ డ్యూయెల్ సెన్సార్లు ఇందులో ఉంటాయి.
iPhone 12 Mini price and specifications : ఐఫోన్ 12 మినీలో 5.4 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లే ఉంటుంది. ఏ14 బయోనిక్ చిప్సెట్ దీని సొంతం. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ డిజైన్ దీని సొంతం. 12ఎంపీ ట్రూడెప్త్ సెల్ఫీ కెమెరా, 4కే డాల్బీ విషన్ హెచ్డీఆర్ రికార్డింగ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
సంబంధిత కథనం