Flair Writing IPO: ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓ; మార్కెట్లోకి రాకముందే రూ. 60 జీఎంపీ
Flair Writing IPO: ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓ నవంబర్ 22వ తేదీన మార్కెట్లోకి రానుంది. విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న సంస్థగా ఫ్లెయిర్ రైటింగ్ కు పేరుంది.
Flair Writing IPO: ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓలో ఒక్కో షేరు ధర రూ.288 నుంచి రూ.304గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో ఒక్కో లాట్ లో 49 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఒక్కో లాట్ కు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.14,896 లను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
9% మార్కెట్ వాటా
2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 915.55 కోట్ల ఆదాయంతో మొత్తం రైటింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ పరిశ్రమలో టాప్-3 ప్లేయర్‌లలో ఒకటిగా ఫ్లెయిర్ (Flair) ఉంది. మార్చి 31, 2023 నాటికి భారతదేశంలోని మొత్తం రైటింగ్, క్రియేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ పరిశ్రమలో సుమారుగా 9% మార్కెట్ వాటాను ఆక్రమించింది.
జీఎంపీ ఎంత?
ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓ (Flair Writing IPO) మార్కెట్లోకి రాకముందే ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందనను పొందుతోంది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్లో ఒక్కో షేరుకు రూ. 60 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అంటే, ఫ్లెయిర్ రైటింగ్ ఈక్విటీ షేర్లు గ్రే మార్కెట్‌లో వాటి ఇష్యూ ధర అయిన రూ. 304 కంటే రూ. 60 ఎక్కువగా ట్రేడవుతున్నాయి. అంటే, లిస్టింగ్ రోజు ఈ ఐపీఓ షేర్లు కనీసం రూ. 364 తో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
Flair Writing IPO Details: ఐపీఓ వివరాలు..
ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓ నవంబర్ 22 నుంచి నవంబర్ 24 వరకు ఇన్వెస్టర్లు సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఫ్లెయిర్ రైటింగ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.288 నుంచి రూ.304 గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా రూ. 593 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. నవంబర్ 30 నాటికి ఈ ఐపీఓ షేర్ల అలాట్ మెంట్ పూర్తవుతుందని సమాచారం. అలాగే, ఈ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లో డిసెంబర్ 5వ తేదీన లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.