Smartphones : 15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్స్.. వాలెంటైన్స్‌ డేకి ప్లాన్ చేయెుచ్చు!-five 5g smartphones under 15000 rupees during amazon fab phones fest checkout deals here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Smartphones : 15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్స్.. వాలెంటైన్స్‌ డేకి ప్లాన్ చేయెుచ్చు!

Smartphones : 15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్స్.. వాలెంటైన్స్‌ డేకి ప్లాన్ చేయెుచ్చు!

Anand Sai HT Telugu Published Feb 09, 2025 02:18 PM IST
Anand Sai HT Telugu
Published Feb 09, 2025 02:18 PM IST

Smartphones : ఈ వాలెంటైన్స్ డేకి మీ ప్రియమైన వారికి ఫోన్ కొనివ్వాలనుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్‌లో బడ్జెట్ ధరలో ఫోన్లు కొనుక్కోవచ్చు. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్ల డిస్కౌంట్లు చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్‌లో జరుగుతున్న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. చౌకైన 5 జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే లేదా వాలెంటైన్స్ డే సందర్భంగా ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే.. ఈ సేల్‌లో మీ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో మంచి డీల్స్ ఉన్నాయి. ఒక్కసారి లిస్ట్‌లో ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం..

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ

ఈ సేల్లో 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఆఫర్ల తర్వాత రూ.14,499కే శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లభిస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మీ నార్జో 70 టర్బో 5జీ

రియల్‌మీ నుండి ఈ ఫోన్ సరైన ఎంపిక కావచ్చు. 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూపన్ డిస్కౌంట్ తర్వాత రూ.13,999 ధరకు లభిస్తుంది. ఈ ఫోన్లో డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5జీ చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ మందం కేవలం 7.6 ఎంఎం మాత్రమే. 6.67 అంగుళాల డిస్ ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సల్ మెయిన్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

రెడ్‌మీ నోట్ 13 5జీ

రెడ్‌మీ నోట్ 13 5జీ సేల్‌లో 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,927గా ఉంది. ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను తగ్గించుకోవచ్చు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.

హెచ్ఎండీ క్రెస్ట్ 5జీ

స్మార్ట్‌ఫోన్ 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధరను రూ.14,499గా నిర్ణయించారు. ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను తగ్గించుకోవచ్చు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. యూనిసోక్ టీ760 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ

ఈ సేల్‌లో 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను తగ్గించుకోవచ్చు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లేను ఇందులో అందించారు. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ స్ట్రాంగ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి ఐపీ 64 రేటింగ్‌తో వస్తుంది.

గమనిక : ఈ ఆఫర్ ధరలు రోజురోజుకు మారుతూ ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆఫర్ ఆధారంగా కథనం ఇచ్చాం. 

Whats_app_banner