ఫస్ట్ ఆధార్, తర్వాత యూపీఐ, ఇప్పుడు ఓఎన్‌డీసీ.. ప్రపంచంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొస్తున్న భారత్!-first aadhaar next upi and now ondc this is how india brings digital revolution to the world know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఫస్ట్ ఆధార్, తర్వాత యూపీఐ, ఇప్పుడు ఓఎన్‌డీసీ.. ప్రపంచంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొస్తున్న భారత్!

ఫస్ట్ ఆధార్, తర్వాత యూపీఐ, ఇప్పుడు ఓఎన్‌డీసీ.. ప్రపంచంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొస్తున్న భారత్!

Anand Sai HT Telugu
Dec 08, 2024 08:30 PM IST

ONDC : ఓఎన్‌డీసీ.. అంటే ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. మరికొన్ని రోజుల్లో ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఇప్పటికే దీనిని సేవలు చాలా మంది వినియోగించుకుంటున్నారు.

ఓఎన్‌డీసీ
ఓఎన్‌డీసీ

ప్రపంచంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడంలో భారత్ ముందంజలో ఉంది. ఇప్పటికే ఆధార్, యూపీఐలాంటి ఆలోచనలతో వివిధ దేశాలకు రోల్ మోడల్‌గా ఉన్న భారత్.. ఇప్పుడు ఇ కామర్స్‌లోనూ సంచలనం సృష్టించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే ఓఎన్‌డీసీని చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. ముందుగా ఓఎన్‌డీసీ అంటే ఏంటో చూద్దాం..

yearly horoscope entry point

ఓఎన్‌డీసీ అనేది ఇ కామర్స్‌కు యూపీఐ లాంటిది. ఆన్‌లైన్ పేమెంట్స్‌లో యూపీఐ ఒక సంచలనం. అలాగే ఇ కామర్స్‌లోనూ ఓఎన్‌డీసీ రెవల్యూషన్ తీసుకురానుంది. ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ అన్నమాట. చిన్న వ్యాపారాలను ప్రొత్సహించడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ కామర్స్‌లకు ఇది చెక్ పెట్టనుంది. ఇ కామర్స్ సాధారంగా రెండు పద్ధతుల్లో పని చేస్తుంది. ఒకటి ఇన్వెంటరీ మోడల్, రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్. ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వస్తువులను కొని కస్టమర్లకు అమ్ముతారు. మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్ బయ్యర్లు, సెల్లర్లు ఉంటారు. వీటిని వెబ్‌సైట్, మెుబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు.

తాజాగా ఓఎన్‌డీసీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే డిజిటల్‌ విప్లవాన్ని తీసుకొస్తున్నామన్నారు. మొదట ఆధార్ కార్డ్, UPI చెల్లింపు, ఇప్పుడు ఓఎన్‌డీసీ భారతదేశం డిజిటలైజేషన్ వైపు పయనిస్తోందని చెప్పారు. డిజిటల్ ట్రేడ్ రంగంలో ఓఎన్‌డీసీకి ఆదరణ పెరుగుతోందని, ప్రతిరోజూ దాదాపు 5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు.

అల్గోరాండ్ ఇండియా సమ్మిట్ 2024లో ఓఎన్‌డీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆర్‌ఎస్ శర్మ మాట్లాడుతూ.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) కార్యక్రమాల ద్వారా డిజిటల్ యాక్సెస్‌ను ప్రజాస్వామ్యీకరించడానికి భారతదేశం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో ఆధార్, యూపీఐ పాత్ర పోషించాయని అన్నారు. ఇప్పుడు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) వంటి కార్యక్రమాలు ఇందులో ప్రముఖంగా ఉన్నాయన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆర్‌ఎస్‌ శర్మ ఓఎన్‌డీసీకి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోజూ 5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని, ప్రతినెలా ఓఎన్‌డీసీ ద్వారా దాదాపు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. దీని సహాయంతో డిజిటల్ కామర్స్ ఊపందుకుందని, ప్రోటోకాల్ ఆధారితంగా తయారు చేసి కొనుగోలుదారులు, అమ్మకందారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చామని చెప్పారు.

ఓఎన్‌డీసీ అన్ని రకాల వస్తువులు, సేవల విక్రయాల నుండి లాజిస్టిక్స్‌ను వేరు చేసిందని ఆయన అన్నారు. ఆధార్, యూపీఐలను మొదట్లో అర్థం చేసుకోలేనట్లే ఇంకా దీని ఫీచర్లను అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. అయితే ఇది క్రమంగా ప్రజలకు చేరుతుందని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నదే మా లక్ష్యమని ఆయన అన్నారు. 'గూగుల్, వాట్సాప్, ఫేస్‌బుక్, కొన్ని మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు మాత్రమే ఉన్నాయి. గుత్తాధిపత్యం కొనసాగుతోంది. నిర్దిష్ట వ్యక్తులు లేదా సంస్థలను శక్తివంతం చేసే వ్యవస్థలు లేదా పరిష్కారాలు మాకు అక్కరలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలి, దీని కోసం డీఐపీ పనిచేస్తోంది.' అని తెలిపారు.

Whats_app_banner