New Fire-Boltt Smartwatch: బిగ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ నుంచి మరో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. రేపే సేల్
Fire-Boltt Terminator smartwatch: ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. పెద్ద సైజ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో లాంచ్ అయింది. రేపు (మార్చి 6) సేల్‍కు రానుంది.
Fire-Boltt Terminator smartwatch: దేశీయ కంపెనీ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) అసలు తగ్గడం లేదు. వరుసగా స్మార్ట్‌వాచ్‍లను మార్కెట్‍లోకి తీసుకొస్తోంది. నయా మోడళ్లను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ఫైర్ బోల్ట్ టర్మినేటర్ (Fire-Boltt Terminator) స్మార్ట్‌వాచ్‍ను ఆ సంస్థ లాంచ్ చేసింది. రేపు (మార్చి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఈ వాచ్ సేల్‍కు వస్తుంది. తొలి సేల్ సందర్భంగా ప్రత్యేక ధరలో అందుబాటులోకి రానుంది. టెర్మినేటర్ వాచ్ డిస్‍ప్లేను ఫైర్ బోల్ట్ హైలైట్ చేస్తోంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఈ వాచ్ కలిగి ఉంటుంది. వివరాలివే..
ఫైర్ బోల్ట్ టర్మినేటర్ ధర, సేల్
Fire-Boltt Terminator Smartwatch: ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. దీన్ని స్పెషల్ లాంచ్ ధరగా ఫైర్ బోల్ట్ పేర్కొంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఫైర్ బోల్ట్ వెబ్‍సైట్‍లో రేపు (మార్చి 6) మధ్యాహ్నం 12 గంటలకు ఈ వాచ్ సేల్‍కు అందుబాటులోకి వస్తుంది. బ్లాక్, బ్లూ, డార్క్ గ్రే, సిల్వర్ గ్రీన్, గోల్డ్ పింక్, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్‍లలో ఈ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ లభిస్తుంది.
ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
Fire-Boltt Terminator Smartwatch: 1.99 ఇంచుల స్క్వేర్ షేప్డ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. 240x283 పిక్సెల్స్ రెజల్యూషన్, 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది. ఇక బ్లూటూత్ కాలింగ్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్ ఉంటాయి. దీంతో మొబైల్‍కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఈ వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. అలాగే డయల్ ప్యాడ్, కాల్ హిస్టరీతో పాటు కొన్ని కాంటాక్టులను సింక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
Fire-Boltt Terminator Smartwatch: హార్ట్ రేట్ ట్రాకింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్రీత్ ట్రైనింగ్ హెల్త్ ఫీచర్లను ఫైర్ బోల్ట్ టర్మినేటర్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 120కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. నోటిఫికేషన్లను కూడా వాచ్‍లో పొందవచ్చు. విభిన్నమైన వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఫైర్ బోర్ట్ టర్మినేటర్ కలిగి ఉంది. వాయిస్ అసిస్టెంట్లకు కూడా సపోర్ట్ చేస్తుంది.
సంబంధిత కథనం