Fire Boltt Rock: అమోలెడ్ రౌండ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలు ఇవే-fire boltt rock smartwatch launched ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Fire Boltt Rock Smartwatch Launched

Fire Boltt Rock: అమోలెడ్ రౌండ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర, ఫీచర్ల వివరాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 10, 2023 07:08 PM IST

Fire-Boltt Rock Smartwatch: ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఆకర్షణీయమైన అమోలెడ్ డిస్‍ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ వాచ్ ఫీచర్లు, ధర వివరాలను ఇక్కడ చూడండి.

Fire Boltt Rock: అమోలెడ్ రౌండ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)
Fire Boltt Rock: అమోలెడ్ రౌండ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Rock Smartwatch: దేశీయ వేరబుల్స్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) మరో స్మార్ట్‌వాచ్‍ (New Smartwatch)ను లాంచ్ చేసింది. అమోలెడ్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ రాక్ (Fire-Boltt Rock) వాచ్‍ను తీసుకొచ్చింది. ఈ వాచ్ సేల్ కూడా మొదలైంది. 550 నిట్స్ బ్రైట్‍నెస్ ఉండే రౌండ్ షేప్డ్ అమోలెడ్ డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి. ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

ఫైర్ బోల్ట్ రాక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Fire-Boltt Rock Smartwatch: 390x390 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.3 రౌండ్ AMOLED డిస్‍ప్లేను ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ డిస్‍ప్లేకు గ్లాస్ కవర్ ఉంటుంది. మెటల్ బటన్, క్రౌన్ ఈ వాచ్‍కు ఉంటాయి.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో Fire-Boltt Rock స్మార్ట్‌వాచ్ వస్తోంది. దీంతో మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్‍లో కాల్ లాగ్స్ కూడా చూడవచ్చు. మొబైల్‍కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాచ్‍కే నోటిఫికేషన్లు వస్తాయి. మ్యూజిక్ ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేయవచ్చు. కాంటాక్టులు సింక్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్‍కు కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ Fire-Boltt Rock వాచ్‍లో 260mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ ధర, సేల్

Fire-Boltt Rock Smartwatch: ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ ధర రూ.2,799గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ వాచ్ సేల్‍కు అందుబాటులో ఉంది. గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.

WhatsApp channel