Smartwatch: డిఫరెంట్ డిజైన్‍తో ఫైర్ బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్-fire boltt blizzard smartwatch launched know price specifications features and more details in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Fire Boltt Blizzard Smartwatch Launched Know Price Specifications Features And More Details In Telugu

Smartwatch: డిఫరెంట్ డిజైన్‍తో ఫైర్ బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 20, 2023 02:16 PM IST

Fire Boltt Blizzard smartwatch: ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్మార్ట్‌వాచ్ వింటేజ్ లుక్‍తో లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్, 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‍తో వస్తోంది.

Smartwatch: డిఫరెంట్ డిజైన్‍తో ఫైర్ బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)
Smartwatch: డిఫరెంట్ డిజైన్‍తో ఫైర్ బోల్ట్ నుంచి కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Blizzard smartwatch: ప్రీమియమ్ వాచ్ అంటూ ఫైర్ బోల్ట్ (Fire-Boltt) బ్రాండ్ మరో స్మార్ట్‌వాచ్‍ (New Smartwatch)ను భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చింది. తన లగ్జరీ (Luxury) కలెక్షన్‍లో ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ (Fire-Boltt Blizzard) వాచ్‍ను యాడ్ చేసుకుంది. స్టెయిన్‍లెస్ స్టీల్, సెరామిక్‍తో ఈ వాచ్ బాడీని రూపొందించినట్టు ఫైర్ బోల్ట్ పేర్కొంది. ఇటీవలే క్వాంటమ్ పేరుతో ఇలాంటి మోడల్‍ను తీసుకొచ్చిన ఫైర్ బోల్ట్.. కాస్త డిజైన్ మార్చి ఇప్పుడు బ్లిజార్డ్ వాచ్‍ను లాంచ్ చేసింది. బ్లూటూత్ కాలింగ్, ప్రీమియమ్ లుక్ ఇచ్చే డిజైన్‍తో ఈ వాచ్ వస్తోంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ ధర, సేల్

Fire-Boltt Blizzard smartwatch: ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్మార్ట్‌వాచ్ ధర రూ.3,499గా ఉంది. మిస్టిక్ బ్లాక్, ఐకానిక్ హోల్డ్, బ్రిలియంట్ సిల్వర్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ నెల 23వ తేదీన ఈ-కామర్స్ ఫ్లిప్‍కార్ట్, కంపెనీ వెబ్‍సైల్‍లో ఈ వాచ్ సేల్‍కు వస్తుంది. క్వాంటమ్‍తో పోలిస్తే ఈ వాచ్ ధర కాస్త ఎక్కువగా ఉంది.

ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్పెసిఫికేషన్లు

Fire-Boltt Blizzard smartwatch: స్టెయిన్‍నెస్ స్టీల్, సెరామిక్‍ను కలబోసి ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్మార్ట్‌వాచ్ బాడీని తయారు చేసినట్టు ఆ సంస్థ పేర్కొంది. దీనికి రెండు ఫంక్షనల్ బటన్లు కూడా ఉన్నాయి. ఒక హోమ్, మరొకటి బ్యాక్ ఆప్షన్ బటన్లు. వాటర్, డస్ట్ రెసిస్టెంట్స్ కోసం ఐపీ 67 రేటింగ్‍తో ఈ బ్లిజార్జ్ స్మార్ట్‌వాచ్ వస్తోంది.

Fire-Boltt Blizzard smartwatch: 240x240 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.28 ఇంచుల రౌండ్ షేప్డ్ డిస్‍ప్లేను ఈ ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‍లో ఇన్‍బుల్ట్‌గా మైక్రోఫోన్, స్పీకర్ ఉంటాయి. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ నుంచి కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు.

Fire-Boltt Blizzard smartwatch: హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ02 సెన్సార్, స్లీపింగ్ ట్రాకర్, పీరియడ్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్లను ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 120కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది.

Fire-Boltt Blizzard smartwatchలో 220mAh బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ చెబుతోంది. ఇక ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో నోటిఫికేషన్లను కూడా ఈ వాచ్‍లో పొందవచ్చు. గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్‍లకు ఈ ఫైర్ బోల్ట్ బ్లిజార్డ్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం