ప్రశ్న:- నాకు 40 ఏళ్లు, ఇటీవలే రూ.50 లక్షలు వచ్చింది. నా పోర్ట్‌ఫోలియో.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (60%), మిగిలినది బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు. నాకు ఇప్పటికే ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఉంది కాబట్టి, 15 సంవత్సరాల కాలపరిమితితో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించాలా? ఆ సమయంలో నేను రిటైర్ కూడా అవుతాను. ఈక్విటీ, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే రియల్ ఎస్టేట్ మెరుగైన వైవిధ్యతను అందిస్తుందా?
రిటైర్మెంట్ ప్లానింగ్, 8-10 సంవత్సరాల్లో నా పిల్లల విద్యకు నిధులు సమకూర్చడం వంటి నా లక్ష్యాలను పరిగణనలోకి తీసుకొని రిస్క్- రిటర్న్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? నేను డెట్ ఫండ్స్ వంటి సురక్షితమైన ఆప్షన్స్‌లో పెట్టుబడి పెట్టాలా లేదా అత్యవసరాల కోసం లిక్విడ్ ఆస్తులను ఉంచాలా? నేను ఏ పన్ను-సమర్థవంతమైన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోవాలి? నేను నా పోర్ట్‌ఫోలియోను ఎంత తరచుగా సమీక్షించాలి? ఎప్పుడు రీబ్యాలెన్స్ చేయాలి?
సమాధానం:- ఈ 50 లక్షల పెట్టుబడి మీ ఫైనాన్షియల్ గోల్స్‌ని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా రిటైర్మెంట్ ప్లానింగ్, వచ్చే 8–15 సంవత్సరాల్లో మీ పిల్లల విద్యకు నిధులు సమకూర్చే సందర్భంలో ఇది ఉపయోగపడుతుంది. 15 సంవత్సరాల సుదీర్ఘ పెట్టుబడి హారిజోన్ ముందు, మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచడం ద్వారా రిస్క్- రిటర్నులను ఆప్టిమైజ్ చేయడానికి మీరు బాగా సిద్ధంగా ఉన్నారు.
రియల్ ఎస్టేట్ పెట్టుబడితో డైవర్సిఫికేషన్: మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలో 60% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కి కేటాయించడం జరిగింది, దీనికి స్థిరాస్తిని చేర్చడం వైవిధ్య ప్రయోజనాలను అందిస్తుంది! ముఖ్యంగా 15 సంవత్సరాల కాలపరిమితి కాబట్టి బాగుంటుంది. స్థిరాస్తి పెట్టుబడులు దీర్ఘకాలికంగా మూలధన పెరుగుదలను అందిస్తాయి. అద్దె ఆదాయానికి అదనపు అవకాశం ఉంది. అయితే, మీరు లాభనష్టాలను జాగ్రత్తగా బేరీజు వేయాలి. ఇది చాలా కీలకం. స్థిరాస్తి అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది. గణనీయమైన ముందస్తు పెట్టుబడి అవసరం! అధిక ట్రాన్సాక్షన్ ఖర్చులను కలిగి ఉంటుంది. మెయిన్టైనెన్స్కి కూడా ఖర్చు చేయల్సి ఉంటుంది.
15 ఏళ్లలో రిటైర్మెంట్, 8-10 ఏళ్లలో మీ పిల్లల చదువులు అనే ద్వంద్వ లక్ష్యాలు. మీ ప్రస్తుత పోర్ట్‌ఫోలియో స్ట్రక్చర్కి అనుగుణంగా రూ.50 లక్షలను 60:40 నిష్పత్తిలో తిరిగి పెట్టుబడి పెట్టడం వ్యూహాత్మక విధానం!
లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో రూ.30 లక్షలను డైవర్సిఫైడ్ ఈక్విటీ ఎంఎఫ్ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిగణించవచ్చు. డైవర్సిఫైడ్ రిస్క్‌తో ఈక్విటీ మార్కెట్ వృద్ధిని పొందొచ్చు.
• దీర్ఘకాలిక సెక్యూర్డ్ బాండ్లు (10-15 సంవత్సరాలు) వంటి సురక్షితమైన స్థిర ఆదాయ సాధనాల్లో రూ .20 లక్షలు పెట్టొచ్చు. తద్వారా అధిక కూపన్ రేట్లను లాక్ చేసుకోవచ్చు. భవిష్యత్తు వడ్డీ రేటు చక్రాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఇది ఈక్విటీ మార్కెట్ అస్తిరత నుంచి రక్షణ కల్పిస్తుంది.
మీ పోర్ట్‌ఫోలియో అభివృద్ధి చెందుతున్నప్పుడు, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండటానికి క్రమం తప్పకుండా సమీక్షించండి. రీబ్యాలెన్స్ చేయండి. మీ పోర్ట్‌ఫోలియోను వార్షికంగా లేదా అర్ధ వార్షికంగా పునఃసమీక్షించడం- మార్కెట్ పరిస్థితులు, జీవిత మార్పులు, మీ రిస్క్ టాలరెన్స్ ఆధారంగా మీ అసెట్ కేటాయింపును సర్దుబాటు చేయడం మంచిది.
సంబంధిత కథనం