స్కూళ్ళలో ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్: విద్యార్ధులు అసలు ఏం నేర్చుకోవాలి?-financial literacy for kids what they should learn to succeed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Financial Literacy For Kids What They Should Learn To Succeed

స్కూళ్ళలో ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్: విద్యార్ధులు అసలు ఏం నేర్చుకోవాలి?

HT Telugu Desk HT Telugu
Oct 26, 2023 12:07 PM IST

Financial literacy program in schools: విద్యార్ధులు అసలు ఏమి నేర్చుకోవాలి? ఆర్కిడ్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ -అకడమిక్స్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ జిమ్మీ అహూజా అందిస్తున్న విశ్లేషణ.

విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ ఆవశ్యకతపై జిమ్మీ అహూజా విశ్లేషణ
విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ ఆవశ్యకతపై జిమ్మీ అహూజా విశ్లేషణ

చాలా వేగముగా మారుతున్న ఈ ప్రపంచములో, యువ తరాలకు మనము అందించగలిగే అత్యంత ముఖ్యమైన స్కిల్ ఫైనాన్షియల్ లిటరసీ. వయోజనులలో ఫైనాన్షియల్ జ్ఞానానికి సంబంధించి స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాటా తెలియజేస్తోంది. ఇది స్కూళ్ళలో కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ విద్యను పరిచయం చెయ్యాలనే ఆవశ్యకతను నొక్కి వక్కాణిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

విద్యార్థులను వారు ఖచ్చితముగా ఎదుర్కోబోయే ఫైనాన్షియల్ సవాళ్ళకు సిద్ధము చెయ్యడానికి, వారికి ఫైనాన్షియల్ లిటరసీలో బలమైన పునాది వేయడం అనేది అత్యంత ముఖ్యము. ఈ ఆర్టికల్‌లో స్కూళ్ళలో పిల్లల కొరకు కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రాములో ఉంచవలసిన ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్, కాన్సెప్టుల గురించి మేం లోతుగా వివరిస్తాం. పిల్లలకు అవసరం, కోరిక మధ్య భేదమును సమర్ధవంతముగా గుర్తించడానిని స్కూళ్ళు ఎలా వారికి నేర్పగలవు? ఇటువంటి ప్రోగ్రాముల వల్ల కలిగే దీర్ఘ-కాల లాభముల గురించి కూడా మేం వివరిస్తాము.

ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్, కాన్సెప్ట్స్

స్కూళ్లలో పిల్లల కోసం కాంప్రిహెన్సివ్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితముగా బేసిక్సుతో మొదలుపెట్టాలి. ఫైనాన్షియల్ సామర్థ్యానికి బిల్డింగ్ బ్లాకులుగా వ్యవహరించే ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్, కాన్సెప్టులను పరిచయం చేయడమనేది ఈ ప్రోగ్రామ్ లక్ష్యం కావాలి. ఈ స్కిల్స్ ఇలా ఉంటాయి.

  • బడ్జెటింగ్: పిల్లలకు బడ్జెట్ సృష్టించడం, మేనేజ్ చేయడాన్ని నేర్పడం చాలా శ్రేష్ఠమైనది. వారు వారి ఫైనేన్షియల్ రిసోర్సులను తెలివిగా ఎలా కేటాయించుకోవాలో ఖచ్చితముగా నేర్చుకోవాలి.
  • పొదుపు చేసుకోవడం: క్రమము తప్పకుండా డబ్బుని పొదుపు చేసుకోవడము అనే అలవాటుని పిల్లలకి మనసుకి హత్తుకునే విధముగా చెప్పాలి. ఇందులో ఎమర్జెన్సీ ఫండ్ యొక్క ప్రాముఖ్యతను అర్ధము చేసుకోవడమూ, అత్యవసర ఖర్చులు చేయవలసి వచ్చినప్పుడు ఈ ఫండ్ రక్షణ వల వలే ఎలా పనిచేస్తుందో చెప్పడమూ ఉంటాయి.
  • పెట్టుబడి పెట్టడం: పిల్లలకు పెట్టుబడి పెట్టడం గురించి చెప్పడం అనేది ఒక అడ్వాన్సుడ్ టాపికుగా కనిపించవచ్చు. వాళ్ళకి పెట్టుబడి పెట్టడం యొక్క బేసిక్స్ గురించి ముందుగానే పరిచయం చేయడం అనేది దీర్ఘ కాలములో గణనీయమైన లాభాలను అందిస్తుంది. చక్ర వడ్డీ కట్టడం, దీర్ఘ-కాల పెట్టుబడుల యొక్క పవర్ వంటి కాన్సెప్టులను యువ మెదడులకు అర్ధము అయ్యేలా సులభతరము చేసి చెప్పాలి.
  • నిర్ణయాలు తీసుకోవడం: స్మార్టుగా డబ్బులకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యాన్ని విద్యార్ధులకు అందించాలి. వారికి గల ఆప్షన్లను వాళ్ళు చూడగలగాలి. వాళ్ళు తెలుసుకున్న ఛాయిసులను ఎంచుకోగలగాలి. అదే సమయములో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పర్యవసానాలను ఎలా ఎదురుకోవాలి అనే దాని గురించి కూడా వారికి సహాయం చేయాలి.
  • రిస్క్ ఎనాలసిస్: రాబోయే రిస్కులను గుర్తించే సామర్ధ్యమును విద్యార్ధులు కలిగి ఉండాలి. డబ్బుని మేనేజ్ చేసేడప్పుడు మనము ఎదుర్కొనే ఒడిదుడుకులను అసెస్ చేసే, మేనేజ్ చేసే సామర్ధ్యమును ఈ ప్రోగ్రామ్ వారికి సమకూర్చాలి.

అవసరాలు, కోరికలు మధ్య భేదం గుర్తించుట

ఫైనాన్షియల్ లిటరసీలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశము ఏమిటంటే, పిల్లలు వారి అవసరాలు, కోరికల మధ్య భేదమును గుర్తించడములో సహాయము చేయడమే. ఈ కాన్సెప్టుని సమర్ధవంతముగా పిల్లల మనసుకి హత్తుకునే విధముగా చెప్పడానికి, స్కూళ్ళు నిజ-జీవిత సినారియోలను ఉపయోగించాలి. ఇందులో విద్యార్ధులు ఐటెములను అవసరాలు, కోరికలుగా క్లాసిఫై చేస్తారు.

ఉదాహరణకు వారు ఇంటిని అవసరంగా, గేమింగ్ కన్సోలుని ఒక కోరికగా క్లాసిఫై చేస్తారు. అదనముగా, బడ్జెటింగ్ ఎక్సర్సైజులు ఈ భేదమును మరింత విశదీకరిస్తాయి. ఈ ఎక్సర్సైజులలో ఊహాజనితమైన బడ్జెట్లు తయారు చేయొచ్చు. అవసరమైన ఆహారము, హౌసింగ్, విద్య వంటి వాటికి ముందుగా రిసోర్సులు కేటాయించడం, తరవాత అత్యవసరం-కాని ఐటములను పరిగణించడం వంటివి ఉంటాయి. అవసరాల కన్నా కోరికలకి ప్రాముఖ్యత ఇస్తే జరిగే పర్యవసానాల గురించిన చర్చలను టీచర్లు ఇనిషియేట్ చేయాలి. విద్యార్ధులకు వారు ఎంచుకునే ఛాయిసులు వారి భవిష్యత్తు ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద ఏ విధముగా ప్రభావం చూపుతాయో ఎనలైజ్ చెయ్యడానికి ఇది సహాయం చేస్తుంది.

ఫైనాన్షియల్ లిటరసీ దీర్ఘ-కాల లాభాలు

స్కూళ్ళలో ఒక బలమైన ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్ అనేది విద్యార్ధులకు పలు దీర్ఘ-కాల లాభాలను అందిస్తుంది. ఈ లాభాలు వారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ స్వేచ్ఛకు సంబంధించినవి. మొదటిగా, ఇది విద్యార్ధులకు ఫైనాన్షియల్ స్వాతంత్య్రం అందిస్తుంది. ఇది వారికి వారి డబ్బుని పొదుపు చేయడం, ఖర్చు చేయడం, వృద్ధి చేయడానికి సంబంధించిన వివరణ కలిగిన ఛాయిసులను ఎంచుకోవడానికి సహాయం చేస్తుంది. మరియు తద్వారా ఇది వారు ఫైనాన్షియల్ సపోర్ట్ కొరకు ఇతరుల పైన ఆధారపడడాన్ని తగ్గిస్తుంది.

తప్పులు చేయకుండా

అదనముగా, ఇది అప్పులు చేయకుండా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఫైనాన్షియల్ లిటరేట్ అయిన వ్యక్తులు అవసరాలకి మించిన అప్పులను చాలా తక్కువగా చేస్తారు. వారు వారి క్రెడిటుని బాధ్యతతో మేనేజ్ చెయ్యడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తద్వారా వారు ఆర్ధిక స్టెబిలిటీకి దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే, ఫైనేన్షియల్ లిటరసీ అనేది వ్యక్తులకు వారి భవిష్యత్తు లక్ష్యాలను సాధించడానికి శక్తిని ఇస్తుంది. ఈ లక్ష్యాలు ఒక ఇంటికి యజమాని అవ్వడము లేదా విద్య వంటివి అవ్వవచ్చు, ఇవి జీవితము యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తాయి. చివరిగా, ఇది తరాల తరబడి తన ప్రభావమును చూపుతుంది. విద్యార్ధులు వారు పెరిగి పెద్దవారు అయ్యాక, ఈ విలువైన పాఠ్యాంశాలను వారి పిల్లలకు అందిస్తారు, తద్వారా కుటుంబాలలో ఫైనేన్షియల్ జ్ఞానము మరియు స్టెబిలిటీ యొక్క చక్రమును సృష్టిస్తారు.

స్కూళ్ళలో ఒక కాంప్రిహెన్సివ్ ఫైనేన్షియల్ లిటరసీ ప్రోగ్రాముని ఉంచడం అనేది కరిక్యులమ్‌కి ఒక విలువైన జోడింపు మాత్రమే కాదు; విద్యార్ధులను ఆధునిక ప్రపంచములోని సవాళ్ళను ఎదురుకోవడం కోసం తయారు చేసే ఒక అత్యవసర అంశం కూడా. ప్రాథమిక ఫైనాన్షియల్ స్కిల్స్ వారికి నేర్పడము ద్వారా రాబోయే తరాలకు బాధ్యతతో కూడిన ఫైనాన్షియల్ నిర్ణయాలు తీసుకోవడానికి శక్తిని అందిస్తున్నాం. తద్వారా వారి భవిష్యత్తు ఫైనాన్షియల్ సెక్యూరిటీని, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీని మనం ధృవీకరిస్తున్నాం. ఇది వారి భవిష్యత్తు కొరకు పెట్టే ఒక పెట్టుబడి, ఇది వారికి జీవితాంతమూ లాభాలను అందిస్తుంది!

- జిమ్మీ అహూజా, వైస్‌ ప్రెసిడెంట్

అకడెమిక్స్ ఫర్ ఫైనేన్షియల్ లిటరసీ,

ఆర్కిడ్స్ ద ఇంటర్నేషనల్ స్కూల్

 

 

 

WhatsApp channel