యూత్‌కి కచ్చితంగా ఉపయోగపడే ఆర్థిక చిట్కాలు.. భవిష్యత్‌లో డబ్బు సమస్యలు రావు!-financial lessons that are definitely useful for youth and young earners save invest smartly ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  యూత్‌కి కచ్చితంగా ఉపయోగపడే ఆర్థిక చిట్కాలు.. భవిష్యత్‌లో డబ్బు సమస్యలు రావు!

యూత్‌కి కచ్చితంగా ఉపయోగపడే ఆర్థిక చిట్కాలు.. భవిష్యత్‌లో డబ్బు సమస్యలు రావు!

Anand Sai HT Telugu

ఇటీవలి కాలంలో యువత చాలా తెలివిగా పెట్టుబడి పెడుతున్నారు. సిప్‌లలో చిన్న వయసులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే తక్కువ వయసులో పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం

ీవితంలో చిన్న వయసు నుంచే పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. చాలా మంది జీవితంలో అతి ముఖ్యమైన పనులను చేయలేకపోతున్నారు. అందుకే ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారు. ముందుగానే డబ్బు పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, రుణం తీసుకోవడం ద్వారా మీ క్రెడిట్‌ను పెంచుకోవడం తెలివైన పని. యువత తమ డబ్బును ఎలా నిర్వహించాలో, ఆర్థికంగా విజయం ఎలా సాధించాలో చూద్దాం..

క్రెడిట్ ప్రొఫైల్

భారతదేశంలో గృహ రుణం, ఆటో రుణం లేదా క్రెడిట్ కార్డ్ పొందడానికి మీ క్రెడిట్ చరిత్ర ముఖ్యమైనది. రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించండి. ఎక్కువ అప్పు చేయకండి. ఈఎంఐ, వడ్డీ దీర్ఘకాలిక ఖర్చులను అర్థం చేసుకోండి. మంచి క్రెడిట్ ప్రొఫైల్ అంటే బాధ్యతాయుతంగా అప్పు తీసుకోవడం, సకాలంలో చెల్లించడం చేయాలి.

పెట్టుబడి

చిన్న వయసులోనే డబ్బు ఆదా చేయడం ప్రారంభించడం చాలా ముఖ్యం. చాలా మంది కాలక్రమేణా ఎంత పెద్ద పొదుపుగా మారుతుందో అంచనా వేయలేకపోతున్నారు. మీరు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే మీ డబ్బు ఎక్కువ పెరగడానికి అంత అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లేదా ప్రావిడెంట్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం మంచిది.

విలువ కోల్పోయే వస్తువులు

త్వరగా విలువ కోల్పోయే వస్తువులను కొనకండి. ఉదాహరణకు తాజా గాడ్జెట్‌లు లేదా ఖరీదైన కార్లు మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. దీని అర్థం త్వరగా విలువ కోల్పోయే వస్తువులతో మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. బదులుగా ఆస్తులపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు స్టాక్స్, రియల్ ఎస్టేట్, SIP పోర్ట్‌ఫోలియో మీ ఆదాయాన్ని పెంచుతాయి.

స్మార్ట్ టాక్స్ ప్లానింగ్

స్మార్ట్ టాక్స్ ప్లానింగ్ అంటే అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను తెలివిగా ఉపయోగించడం. సెక్షన్ 80C తగ్గింపుల నుండి దీర్ఘకాలిక మూలధన లాభాల వ్యూహాల వరకు పన్ను వ్యవస్థను అర్థం చేసుకోవడం వలన మీరు సంపాదించిన డబ్బును నిలుపుకోవడానికి, దానిని బాగా పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది.

సైడ్ బిజినెస్

జీతంతో కూడిన ఉద్యోగాలు సురక్షితమైనవి. అయితే సైడ్ బిజినెస్‌లు, పెట్టుబడులు లేదా మీ స్వంత వ్యాపారాన్ని కలిగి ఉంటే మరింత డబ్బు వస్తుంది. దీని అర్థం జీతంతో కూడిన ఉద్యోగాలు స్థిరంగా ఉన్నప్పటికీ, సైడ్ బిజినెస్‌లు పెట్టుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. మార్కెట్లో అవకాశాలను గుర్తించండి. ఫ్రీలాన్సింగ్ అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.