Rail Vikas Nigam: ‘రైల్ వికాస్ నిగమ్’ ఇక ‘మినిరత్న’ కాదు.. ‘నవరత్న’ కంపెనీ-finance ministry approves navratna status to rail vikas nigam ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rail Vikas Nigam: ‘రైల్ వికాస్ నిగమ్’ ఇక ‘మినిరత్న’ కాదు.. ‘నవరత్న’ కంపెనీ

Rail Vikas Nigam: ‘రైల్ వికాస్ నిగమ్’ ఇక ‘మినిరత్న’ కాదు.. ‘నవరత్న’ కంపెనీ

HT Telugu Desk HT Telugu

ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ (Rail Vikas Nigam Limited RVNL) కు నవరత్న’ హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది. దాంతో, నవరత్న హోదా పొందిన 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా రైల్ వికాస్ నిగమ్ (Rail Vikas Nigam Limited RVNL) నిలిచింది.

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited RVNL) కు నవరత్న (Navratna)’ హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) బుధవారం ఆమోదం తెలిపింది. దాంతో, నవరత్న (Navratna) హోదా పొందిన 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (CPSE) గా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited RVNL) నిలిచింది. ఇప్పటివరకు ఈ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కేటగిరీ 1 మినీ రత్న (Miniratna) హోదాలో ఉంది.

RVNL Navratna: రైల్వే శాఖ ఆధ్వర్యంలో..

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited RVNL) రైల్వే శాఖ నిర్వహణలోని ప్రభుత్వ రంగ సంస్థ. ఈ సంస్థ వార్షిక టర్నోవర్ రూ. 19,381 కోట్లు. అలాగే, 2021 -22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 1,087 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఈ సంస్థకు నవరత్న (Navratna) హోదా కల్పించాలన్న ప్రతిపాదన చాన్నాళ్లుగా ఉంది. నవరత్న గా అప్ గ్రేడ్ చేయడం వల్ల సంస్థ చాలా విషయాల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం, వేరే సంస్థలతో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో మరింత స్వతంత్రత లభిస్తుంది. అలాగే, అనేక ఆర్థిక విషయాల్లో స్వీయ నిర్ణయాలకు అవకాశం లభిస్తుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited RVNL) కు నవరత్న (Navratna) హోదా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని, ఇకపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నవరత్న (Navratna) హోదా పొందిన 13వ సంస్థగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (Rail Vikas Nigam Limited RVNL) నిలుస్తుందని డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (DPE) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.