నిత్య అవసరాల కోసం ఇటీవలి కాలంలో ప్రజలు క్రెడిట్ కార్డులవైపు మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై అనేక బెనిఫిట్స్‌ని ఇస్తున్నాయి. వీటిల్లో ఫెడరల్ బ్యాంక్ ఒకటి. మరీ ముఖ్యంగా ఫెడరల్ బ్యాంక్ వీసా ఇంపీరియో క్రెడిట్ కార్డుతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వార్షిక ఫీజు: క్రెడిట్ కార్డుపై మొత్తం వార్షిక ఫీజు రూ.1,500. ఇది వార్షిక వ్యయం ఆధారంగా సంభావ్య మినహాయింపులతో వస్తుంది.
రివార్డులు: హెల్త్ కేర్, గ్రోసరీస్ వంటి ఎంపిక చేసిన విభాగాల్లో 3 రెట్ల వరకు రివార్డ్ పాయింట్లు పొందవచ్చు.
వినోద ప్రయోజనాలు: బై వన్ గెడ్ వన్ స్కీమ్ ద్వారా ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఐనాక్స్‌లో సినిమా టికెట్ ఫ్రీగా పొందొచ్చు.
ట్రావెల్ బెనిఫిట్స్: ప్రతి త్రైమాసికానికి రెండు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందొచ్చు.
ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు: ఇంధన లావాదేవీలపై 1% మినహాయింపు. నెలకు రూ.150 చొప్పున రూ.400 నుంచి రూ.5,000 మధ్య లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.
ఈ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్, రూల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శంచి, నియమనిబంధనలను తెలుసుకోవాలి.
అందువల్ల, పైన ఇచ్చిన దశలను శ్రద్ధగా అనుసరించడం ద్వారా మీరు ఫెడెరల్ బ్యాంక్ వీసా ఇంపీరియో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం, వివరణ కోసం ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడండి. నిర్దేశిత కస్టమర్ సర్వీస్ బృందంతో మీ సందేహాలను చర్చించండి. పరిష్కరించుకోండి.
సంబంధిత కథనం