Federal Bank: ఎఫ్ డీ వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్ బ్యాంక్-federal bank hikes fixed deposit rates with up to 7 75 on this tenor ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Federal Bank Hikes Fixed Deposit Rates With Up To 7.75% On This Tenor

Federal Bank: ఎఫ్ డీ వడ్డీ రేట్లను పెంచిన ఫెడరల్ బ్యాంక్

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 03:07 PM IST

వివిధ కాల వ్యవధుల ఫిక్స్ డ్ డిపాజిట్ల (fixed deposits FD) వడ్డీ రేట్లను 7.75% వరకు ఫెడరల్ బ్యాంక్ పెంచింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వివిధ కాల వ్యవధులు, రూ. 2 కోట్ల లోపున్న వివిధ మొత్తాల ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) వడ్డీ రేట్లను పెంచుతూ ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

  • 7 రోజుల నుంచి 2223 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) కు, సాధారణ ప్రజలకు 3% నుంచి 6.6% వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.5% నుంచి 7.25% వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది.
  • 15 నెలల నుంచి రెండు సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) కు సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.25% వరకు, సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.75% వరకు వార్షిక వడ్డీ లభిస్తుంది.
  • వివిధ మొత్తాల వడ్డీ రేట్ల పూర్తి వివరాలకు ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
  • సవరించిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వస్తాయి.
  • 7 రోజుల నుంచి 29 రోజల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) కు 3% వడ్డీని, 30 రోజుల నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) కు 3.25% వడ్డీ, 46 రోజుల నుంచి 60 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) కు 4% వార్షిక వడ్డీ లభిస్తుంది.
  • 61 రోజుల నుంచి 90 రోజుల్లో మెచ్చూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల కు 4.25% వడ్డీ, 91 రోజుల నుంచి 119 రోజుల్లో మెచ్చూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs)కు 4.50%, 120 రోజుల నుంచి 180 రోజుల్లో మెచ్చూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల కు 4.75%, 181 రోజుల నుంచి 270 రోజుల్లో మెచ్చూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs) కు 5.75%, 271 రోజుల నుంచి 365 రోజుల్లో మెచ్చూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్ల కు 6.0% వార్షిక వడ్డీ లభిస్తుంది.
  • ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడానికి కనీస మొత్తం రూ. 1000. ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs)పై వడ్డీ (ని నెలవారీగా కానీ, మూడు నెలలకు ఒకసారి కానీ, ఆరు నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ పొందవచ్చు.
  • ఫిక్స్ డ్ డిపాజిట్ల (FDs)పై 90% వరకు లోన్ పొందే అవకాశాన్ని కూడా ఫెడరల్ బ్యాంక్ కల్పిస్తోంది.

WhatsApp channel

టాపిక్