FD Interest Rates : ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ 6 బ్యాంకులు అందించే వడ్డీ రేటు ఎంతో తెలుసుకోండి-fd interest rates 6 banks that offer up to 7 5 percent on their 1 year fixed deposits check out list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fd Interest Rates : ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ 6 బ్యాంకులు అందించే వడ్డీ రేటు ఎంతో తెలుసుకోండి

FD Interest Rates : ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ 6 బ్యాంకులు అందించే వడ్డీ రేటు ఎంతో తెలుసుకోండి

Anand Sai HT Telugu Published Feb 19, 2025 05:27 PM IST
Anand Sai HT Telugu
Published Feb 19, 2025 05:27 PM IST

FD Interest Rates : కొన్ని బ్యాంకులు ఫిక్స్‌‌డ్‌ డిపాజిట్లపై ప్రస్తుతం ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నాయి. ఈ పద్ధతి మీకు పెట్టుబడికి దారితీస్తుంది. దీని ద్వారా రాబడులను కూడా పొందవచ్చు.

ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు
ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు

మన దగ్గర నమ్మకమైన పెట్టుబడి పద్ధతిలో ఫిక్స్‌‌డ్‌ డిపాజిట్లు ఒకటి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ అనేది బ్యాంకులు.. రేపో రేటుకు తగ్గట్టుగా అందిస్తుంటాయి. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించింది. మరోవైపు బ్యాంకులు కూడా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. చాలా ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు త్వరలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ల(FD)పై వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభిస్తాయని అంచనాలు ఉన్నాయి. మీరు మీ పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని ఒక సంవత్సరం పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల గురించి తెలుసుకోండి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఇది అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్. జనరల్, సీనియర్ సిటిజన్లకు ఒక సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వరుసగా 6.6 శాతం, 7.10 శాతం వడ్డీని అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్

ఈ ప్రైవేట్ బ్యాంక్ జనరల్, సీనియర్ సిటిజన్లకు ఒక సంవత్సరం డిపాజిట్లపై వరుసగా 6.7 శాతం, 7.20 శాతం వడ్డీని అందిస్తుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్

ఈ ప్రైవేట్ బ్యాంక్ 1 సంవత్సరం టర్మ్ డిపాజిట్లపై కొంచెం ఎక్కువ వడ్డీని అందిస్తుంది. అంటే సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం ఇస్తుంది.

ఫెడరల్ బ్యాంక్

ఈ బ్యాంకు 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీని ఇస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

ఈ బ్యాంక్ 1 సంవత్సరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.85 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీని అందిస్తుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఈ ప్రభుత్వ బ్యాంకు ఒక సంవత్సరం కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీని అందిస్తుంది.

Anand Sai

eMail
Whats_app_banner

సంబంధిత కథనం