Highest FD interest rates: ఏడాది ఎఫ్ డీలపై అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్ లు ఇవే..
FD interest rates: సురక్షిత పెట్టుబడి విధానాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి. ఇన్వెస్టర్లు ఈ ఎఫ్డీల ద్వారా క్రమం తప్పకుండా ఆదాయం పొందుతారు. ఎఫ్డీలపై వేర్వేరు బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తాయి. అలాగే, వేర్వేరు కాలపరిమితుల ఎఫ్డీలకు వేర్వేరు వడ్డీ రేట్లు ఉంటాయి.
FD interest rates: ఫిక్స్ డ్ డిపాజిట్ (FD)లో మీ డబ్బును పెట్టుబడి పెట్టేముందు ఎఫ్డీలపై వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి. సాధారణంగా చాలా బ్యాంకులు తక్కువ కాలానికి తక్కువ వడ్డీ, ఎక్కువ కాలానికి అధిక వడ్డీని అందిస్తున్నాయి. ఒక సంవత్సరం కాలపరిమితి గల ఎఫ్ డీ లపై పలు అగ్రశ్రేణి బ్యాంకులు అందించే వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లలో వ్యత్యాసం పెద్దగా లేనప్పటికీ, 10-20 బేసిస్ పాయింట్ల చిన్న తేడా మొత్తం రాబడిలో గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు రూ.10 లక్షల ఎఫ్డీపై 20 బేసిస్ పాయింట్ల వ్యత్యాసంతో ఏడాదిలో రూ.2,000 అదనపు వడ్డీ లభిస్తుంది. మీరు డబ్బును మూడేళ్ల పాటు ఉంచితే, ఈ అదనపు ఆదా రూ. 6,000 లకు పెరుగుతుంది. డిపాజిట్ మరో రూ.10 లక్షలు పెరిగితే మొత్తం పొదుపు రూ.12,000కు పెరగవచ్చు. దీనికి కారణం అదనంగా లభించే 20 బేసిస్ పాయింట్ల వడ్డీ మాత్రమే.
ఈ బ్యాంకుల్లో ఎఫ్డీలపై..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (hdfc bank) సాధారణ పౌరులకు 1 సంవత్సరం ఫిక్సడ్ డిపాజిట్ పై 6.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సాధారణ పౌరులకు ఒక ఏడాది డిపాజిట్ పై 6.7 శాతం, , సీనియర్ సిటిజన్లకు 7.2 శాతం వడ్డీని అందిస్తోంది. అక్టోబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన వడ్డీరేట్లనే యాక్సిస్ బ్యాంక్ కూడా అందిస్తోంది. కోటక్ మహీంద్రా రెగ్యులర్ కస్టమర్లకు ఒక ఏడాది కాలపరిమితి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీరేట్లు (bank interest rates) ఈ సంవత్సరం జూన్ 14 నుండి అమల్లోకి వచ్చాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో..
ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఎస్బీఐ (state bank of india) సాధారణ కస్టమర్లకు ఏడాది ఎఫ్డీ (fixed deposit rates) పై 6.8%, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 2024 జూన్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెగ్యులర్ సిటిజన్లకు 6.8 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.3 శాతం వడ్డీని అక్టోబర్ 1 నుంచి అందిస్తోంది.
Bank | Regular citizens (%) | Senior citizens (%) |
---|---|---|
HDFC Bank | 6.60 | 7.10 |
ICICI Bank | 6.7 | 7.2 |
State Bank of India (SBI) | 6.80 | 7.30 |
Kotak Mahindra Bank | 7.10 | 7.6 |
Punjab National Bank (PNB) | 6.8 | 7.3 |
Axis Bank | 6.7 | 7.2 |
(మూలం: బ్యాంక్ వెబ్ సైట్లు)