Fastrack New Smartwatch: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో ఫాస్ట్రాక్ నయా స్మార్ట్‌వాచ్: బ్లూటూత్ కాలింగ్ కూడా: ప్రత్యేక ధరతో సేల్‍కు-fastrack brings limitless fs1 smartwatch to indian market check price features sale details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Fastrack Brings Limitless Fs1 Smartwatch To Indian Market Check Price Features Sale Details

Fastrack New Smartwatch: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో ఫాస్ట్రాక్ నయా స్మార్ట్‌వాచ్: బ్లూటూత్ కాలింగ్ కూడా: ప్రత్యేక ధరతో సేల్‍కు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 09, 2023 04:34 PM IST

Fastrack Limitless FS1 Smartwatch: ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. కర్వ్‌డ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 150కుపైగా వాచ్ ఫేసెస్‍తో లాంచ్ అయింది.

Fastrack New Smartwatch: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో ఫాస్ట్రాక్ నయా స్మార్ట్ వాచ్ లాంచ్ (Photo: Fastrack)
Fastrack New Smartwatch: కర్వ్‌డ్ డిస్‍ప్లేతో ఫాస్ట్రాక్ నయా స్మార్ట్ వాచ్ లాంచ్ (Photo: Fastrack)

Fastrack Limitless FS1 Smartwatch: ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 స్మార్ట్‌వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. కర్వ్డ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్‍తో ఈ వాచ్‍ను ఫాస్ట్రాక్ తీసుకొచ్చింది. అమెజాన్ ఫ్యాషన్ భాగస్వామ్యంతో ఫాస్ట్రాక్ ఈ వాచ్‍ను రూపొందించింది. డిస్‍ప్లేను ఎక్కువగా హైలైట్ చేస్తోంది. ప్రత్యేక ధరతో ఫస్ట్ సేల్‍కు తీసుకురానున్నట్టు ఫాస్ట్రాక్ పేర్కొంది. ఈ Fastrack Limitless FS1 స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, సేల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Fastrack Limitless FS1 Smartwatch: ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 స్మార్ట్‌వాచ్‍లో ఏటీఎస్ చిప్‍సెట్‍ ఉంటుంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‍తో వస్తోంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఈ వాచ్‍లో ఇన్‍బుల్ట్ స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. దీంతో ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. బ్లూటూత్ కాలింగ్ కోసం సింగిల్ ట్రూ టెక్నాలజీ ఉంటుందని ఫాస్ట్రాక్ పేర్కొంది.

డిస్‍ప్లే, బ్యాటరీ

Fastrack Limitless FS1 Smartwatch: 1.95 ఇంచుల స్క్వేర్ హారిజన్ కర్వ్‌డ్ డిస్‍ప్లేతో ఈ ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 వాచ్ వస్తోంది. అంటే ఈ వాచ్ కర్వ్డ్ ఎడ్జెస్‍ను కలిగి ఉంటుంది. 500 నిట్స్ బ్రైట్‍నెస్ ఉంటుంది. 150కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ వాచ్‍లో 300mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని ఆ సంస్థ చెబుతోంది. అయితే బ్లూటూత్ కాలింగ్‍ను ఎక్కువగా వినియోగిస్తే బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉండొచ్చు.

హెల్త్ ఫీచర్లు ఇలా

Fastrack Limitless FS1 Smartwatch: నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, ఒత్తిడిని విశ్లేషించే స్ట్రెస్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్లను ఈ ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 100కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది. అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది. ఫోన్‍లో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ వరల్డ్ యాప్‍కు ఈ వాచ్‍ను సింక్ చేసుకొని వర్కౌట్, హెల్త్ వివరాలతో పాటు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇక ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వాచ్‍లోనే నోటిఫికేషన్లను పొందవచ్చు.

ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 ధర, సేల్

Fastrack Limitless FS1 Price: ఫాస్ట్రాక్ లిమిట్‍లెస్ ఎఫ్ఎస్1 స్మార్ట్‌వాచ్ ధర రూ.1,995గా ఉంది. దీన్ని స్పెషల్ లాంచ్ ధరగా ఫాస్ట్రాక్ పేర్కొంది. ఈనెల 11వ తేదీన ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon)లో ఈ వాచ్ సేల్‍కు వస్తుంది. బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫాస్ట్రాక్ నయా స్మార్ట్‌వాచ్ లభిస్తుంది. రూ.1,995 స్పెషల్ లాంచ్ ధర ఎన్ని రోజులు ఉంటుందో ఫాస్ట్రాక్ పేర్కొనలేదు.

WhatsApp channel