FASTag new rules : అలర్ట్​! ఆ ఫాస్టాగ్స్​ని మార్చాల్సిందే- రేపటి నుంచి కొత్త రూల్స్​ అమలు..-fastag new rules effective august 1 kyc updates vehicle detail linking more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fastag New Rules : అలర్ట్​! ఆ ఫాస్టాగ్స్​ని మార్చాల్సిందే- రేపటి నుంచి కొత్త రూల్స్​ అమలు..

FASTag new rules : అలర్ట్​! ఆ ఫాస్టాగ్స్​ని మార్చాల్సిందే- రేపటి నుంచి కొత్త రూల్స్​ అమలు..

Sharath Chitturi HT Telugu
Jul 31, 2024 10:15 AM IST

FASTag alert : ఫాస్టాగ్​ యూజర్స్​కి అలర్ట్​! ఆగస్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆ ఫాస్టాగ్స్​ని మార్చాల్సిందే
ఆ ఫాస్టాగ్స్​ని మార్చాల్సిందే

టోల్ చెల్లింపు ప్రక్రియను మెరుగుపరిచేందుకు, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు కొత్త నిబంధనలు ఆగస్ట్​ 1న అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్​ ప్రకారం ఫాస్టాగ్​కి కచ్చితంగా కేవైసీ (నో యువర్​ కస్టమర్​) తప్పనిసరి. ఇందులో అక్టోబర్​ 31 వరకు గడువు ఉంది. ఫాస్టాగ్ సేవలను అందించే సంస్థలు ఈ గడువులోగా మూడు నుంచి ఐదేళ్ల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్స్​కి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

yearly horoscope entry point

ఫాస్టాగ్​కు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ముఖ్యమైనది ఫాస్టాగ్ కేవైసీ. ఈ ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమవుతుంది. ఫాస్టాగ్ కస్టమర్లు ఎన్పీసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ వ్యవధిలో వారి కేవైసీని అప్​డేట్ చేసేలా చూసుకోవాలి.

ఆగస్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ నిబంధనలు..

ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్​లను కచ్చితంగా మార్చాలి.

మూడేళ్ల ఫాస్టాగ్​లకు కేవైసీ అప్​డేట్: మూడేళ్ల క్రితం జారీ చేసిన ఫాస్టాగ్ లకు కేవైసీని అప్​డేట్ చేయాలి.

వాహన వివరాల అనుసంధానం: వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్ తప్పనిసరిగా ఫాస్టాగ్​తో అనుసంధానం చేయాలి.

కొత్త వాహన రిజిస్ట్రేషన్ అప్డేట్: కొత్త వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ నంబర్​ని అప్​డేట్ చేయండి.

డేటాబేస్ వెరిఫికేషన్: ఫాస్టాగ్ ప్రొవైడర్లు తమ డేటాబేస్లను వెరిఫై చేయాలి.

ఇదీ చూడండి:- FASTag : కారు అమ్మేస్తుంటే.. ఫాస్టాగ్​ని ఏం చేయాలో తెలుసా?

ఫోటో అప్​లోడ్ ఆవశ్యకత: కారు ముందువైపు, వెనుకవైపు స్పష్టమైన ఫోటోలను అప్​లోడ్ చేయాలి.

మొబైల్ నంబర్ లింకింగ్: ఫాస్టాగ్ తప్పనిసరిగా మొబైల్ నంబర్​కు లింక్ అయి ఉండాలి.

ఆగస్టు 1వ తేదీ నుంచి కంపెనీలు ఎన్పీసీఐ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, మూడు నుంచి ఐదేళ్లు దాటిన ఫాస్టాగ్​లకు కేవైసీని అప్​డేట్ చేయాలని, అక్టోబర్ 31లోగా ఐదేళ్లకు పైబడిన వాటిని భర్తీ చేయాలని కంపెనీలకు ఎన్​హెచ్​ఏఐ కోరింది. వాహన యజమానులు కూడా 2024 అక్టోబర్ 31లోగా తమ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇలా చేయకపోతే రెట్టింపు ఛార్జీలు..!

టోల్ వసూలుపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) కొన్ని రోజుల క్రితం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. విండ్​స్క్రీన్​ మీద ఫాస్టాగ్​ని అతికించని వాహనాలకు ఇకపై రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఇక నుంచి ఫాస్టాగ్​ని కచ్చితంగా విండ్​స్క్రీన్​కి అతికించాలి.

మూడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఆర్ఎఫ్ఐడీ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్ ఫాస్టాగ్ జాతీయ రహదారులపై అన్ని వాహనాలు టోల్ ప్లాజాలను దాటడానికి తప్పనిసరి. విండ్ స్క్రీన్​పై ఫాస్టాగ్​లు లేని వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆలస్యాన్ని కలిగిస్తాయని, ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని ఎన్​హెచ్​ఏఐ తెలిపింది. అందుకే ఛార్జీలను రెట్టింపు చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది.

భారతదేశంలోని జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ప్లాజాలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం