భారతీయులు ఎగబడి కొంటున్న ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- సింగిల్​ ఛార్జ్​తో రేంజ్​ ఎంతంటే..-family electric scooter ather rizta crosses 1 lakh unit retail sales milestone ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  భారతీయులు ఎగబడి కొంటున్న ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- సింగిల్​ ఛార్జ్​తో రేంజ్​ ఎంతంటే..

భారతీయులు ఎగబడి కొంటున్న ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- సింగిల్​ ఛార్జ్​తో రేంజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

ఏథర్​ నుంచి గతేడాది లాంచ్​ అయిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రిజ్టాపై బిగ్​ అప్డేట్​! ఈ మోడల్​ 1 లక్ష సేల్స్​ మైలురాయిని తాకింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏథర్​ రిజ్టా

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ అయిన ఏథర్​ రిజ్టాపై బిగ్​ అప్డేట్​! ఈ ఈ-స్కూటర్​ని లాంచ్ చేసిన ఏడాదిలోనే భారత మార్కెట్​లో లక్ష యూనిట్లకు పైగా అమ్ముడుపోయినట్టు సంస్థ ప్రకటించింది. రిజ్టా అనేది.. బ్రాండ్​కి మొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. గత ఏడాది లాంచ్ అయిన తర్వాత ఏథర్ మొత్తం అమ్మకాల పరిమాణంలో రిజ్టా వాటా 60 శాతంగా ఉందని ఏథర్ ఎనర్జీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఏథర్​ రిజ్టా వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

బెస్ట్​ సెల్లింగ్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది..

ఏప్రిల్ 2024లో ఏథర్ కమ్యూనిటీ డే నాడు రిజ్టాను మొదటిసారిగా ఆవిష్కరించింది సంస్థ. దేశవ్యాప్తంగా జూన్ 2024 నుంచి ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రిటైల్స్ ప్రారంభమయ్యాయి.

దేశ 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లో ఏథర్​ తన మార్కెట్​ షేరును పెంచుకునేందుకు ఈ రిజ్టా దోహదపడింది. 2025 ఆర్థిక సంవత్సరం రెండొవ త్రైమాసికంలో డెలివరీల పెరుగుదల తరువాత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్​గఢ్ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్ వాటాలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. అదనంగా, రిజ్టా, ఏథర్ 450 సిరీస్​తో కలిసి క్యూ 4 ఎఫ్​వై25 నాటికి దక్షిణ భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ స్థానానికి ఎథర్ ఎదగడానికి దోహదపడిందని వాహన్ డేటా తెలిపింది.

ఈ మైలురాయిపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఫొకేలా మాట్లాడుతూ.. “రిజ్టాతో లక్ష మైలురాయిని అందుకోవడం మాకు గొప్ప క్షణం. భారతీయ కుటుంబాల అవసరాలను తీర్చడంపై దృష్టి సారించి స్క్రాచ్​ నుంచి నిర్మించిన రిజ్టా, మా పరిధిని విస్తరించడంలో, మరింత విస్తృతమైన వినియోగదారులతో కనెక్ట్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇది కుటుంబ స్కూటర్​కి అవసరమైన ప్రతిదాన్ని ఆచరణాత్మకంగా మిళితం చేస్తుంది. విశాలమైన, సౌకర్యవంతమైన సీటు, తగినంత స్టోరేజ్, భద్రతా లక్షణాలు, రోజువారీ ప్రయాణాన్ని అప్రయత్నంగా చేయడానికి విశ్వసనీయత.. అథర్​కు ప్రసిద్ధి చెందిన గొప్ప డిజైన్​లో ప్యాక్ చేయడం జరిగింది. ప్రారంభించిన ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే, రిజ్టా బహుళ రాష్ట్రాల్లో మా మార్కెట్ వాటాను గణనీయంగా పెంచడానికి, మా వినియోగదారుల ప్రొఫైల్​ని విస్తరించడానికి మాకు సహాయపడింది,” అని అన్నారు.

ఏథర్ రిజ్టా ధర ఎంత?

ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టా ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభమై రూ.1.49 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్.

ఏథర్ రిజ్టా రేంజ్, బ్యాటరీ, పనితీరు ఎలా ఉంది?

ఏథర్ ఎనర్జీ రిజ్టాలో 2.9 కిలోవాట్ల బ్యాటరీని అమర్చింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. ఇక 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న వెర్షన్ 159 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. రెండు మోడళ్లు 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్​లో ఉపయోగించిన ఒకే పీఎంఎస్ ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తాయి. రిజ్టాలోని మోటారు కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

స్టాండర్డ్ ఛార్జర్లను ఉపయోగించినప్పుడు 2.9 కిలోవాట్ల బ్యాటరీని పూర్తిగా క్షీణించిన స్థితి నుంచి 5 గంటల 45 నిమిషాల్లో 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చని, 3.7 కిలోవాట్ల వేరియంట్ పూర్తి ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుందని ఏథర్ వెల్లడించింది.

అంతేకాక, పెద్ద బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఏథర్ గ్రిడ్​ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు కేవలం 10 నిమిషాల్లో 15 కిలోమీటర్ల పరిధిని భర్తీ చేయవచ్చు.

అంతేకాదు.. సెగ్మెంట్​లోనే భారీ సీటింగ్​ కెపాసిటీతో నిజమైన ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​గా దూసుకెళుతోంది ఈ ఏథర్​ రిజ్టా.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం