UPI updates in 2024: ‘యూపీఐ ఏటీఎం’ సహా ఈ సంవత్సరంలో డిజిటల్ పేమెంట్స్ విధానంలో కొత్తగా రానున్న మార్పులు ఇవే..-exciting upi updates in 2024 here are 5 new key features you will benefit from ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Upi Updates In 2024: ‘యూపీఐ ఏటీఎం’ సహా ఈ సంవత్సరంలో డిజిటల్ పేమెంట్స్ విధానంలో కొత్తగా రానున్న మార్పులు ఇవే..

UPI updates in 2024: ‘యూపీఐ ఏటీఎం’ సహా ఈ సంవత్సరంలో డిజిటల్ పేమెంట్స్ విధానంలో కొత్తగా రానున్న మార్పులు ఇవే..

HT Telugu Desk HT Telugu
Jan 06, 2024 05:39 PM IST

UPI updates in 2024: డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు సర్వ సాధారణమైంది. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. క్యాష్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్.. ఏవీ అవసరం లేదు. ఈజీగా మనీ ట్రాన్స్ ఫర్ చేసేయొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pexels)

UPI updates in 2024: ఈ సంవత్సరం యూపీఐ పేమెంట్స్ (UPI payments) విధానంలో పలు కొత్త మార్పులు వస్తున్నాయి. వినియోగదారులు సురక్షితంగా, సులభంగా మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునేలా 2024 లో పలు కొత్త నిబంధనలను తీసుకువస్తున్నారు.

yearly horoscope entry point

యూపీఐ నిబంధనల్లో మార్పు..

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చెల్లింపు పద్ధతి అయిన ‘‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)’’ కి కొన్ని తాజా అప్‌డేట్‌లు 2024 లో రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కలిసి ఈ నిబంధనలను రూపొందించాయి. ఇవి మీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ అనుభవాలను, ఇతర పేమెంట్ అనుభవాలను మరింత మెరుగుపరుస్తాయి.

1. Dynamic UPI IDs: సంవత్సరం లావాదేవీలు లేనట్లయితే డీ యాక్టివేట్

ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగని యూపీఐ ఐడీ (UPI ID) లను డీ యాక్టివేట్ చేయాలని ఎన్పీసీఐ (NPCI) అన్ని పేమెంట్స్ యాప్స్ ను ఆదేశించింది. గూగుల్ పే, పేటీఎం, లేదా ఫోన్ పే.. పేమెంట్ యాప్ ఏదైనా సరే, ఆ పేమెంట్ యాప్ లోని మీ యూపీఐ ఐడీ నుంచి ఒక సంవత్సరం పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోతే, ఆ ఐడీ డీ యాక్టివేట్ అవుతుంది. మనీ డిజిటల్ ట్రాన్స్ ఫర్స్ లో మోసాలు జరగకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

2. UPI for Secondary Market: సెకండరీ మార్కెట్లో కూడా యూపీఐ వినియోగం

త్వరలో సెకండరీ మార్కెట్లో కూడా యూపీఐ ని వినియోగించే అవకాశం లభించనుంది. ఈ దిశగా ఎన్పీసీఐ (NPCI) చర్యలు ప్రారంభించింది. ఈ అవకాశం అమల్లోకి వచ్చిన తరువాత కస్టమర్ల ఖాతాలో ఫండ్స్ ను యూపీఐ ఐడీ ద్వారా బ్లాక్ చేసుకుని, ట్రేడ్ కన్ఫర్మ్ అయిన తరువాత డెబిట్ అయ్యేలా చూసుకోవచ్చు.

3. UPI ATMs: యూపీఐ ఏటీఎం

హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ భాగస్వామ్యంతో ఎన్పీసీఐ దేశవ్యాప్తంగా యూపీఐ ఏటీఎం (UPI ATM) లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇప్పుడు, వినియోగదారులు డెబిట్ కార్డ్ అవసరం లేకుండా UPI యాప్‌లను ఉపయోగించి, ఆ ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. మొదటి ATM ఇప్పటికే ప్రారంభించారు. త్వరలో దేశవ్యాప్తంగా మరికొన్నింటిని ప్రారంభించనున్నారు.

4. Transaction Limit: ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు

యూపీఐ లావాదేవీల చెల్లింపు పరిమితిని త్వరలో పెంచనున్నారు. ముఖ్యంగా, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చేసే చెల్లింపుల పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచనున్నారు. భారీ మొత్తంలో చెల్లింపులు జరిపేవారికి ఈ ఈ నిర్ణయం మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.

5. time limit: టైమ్ లిమిట్

యూపీఐ పేమెంట్స్ లో మోసాలను అరికట్టే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త సెక్యూరిటీ విధానాలను తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే, టైమ్ లిమిట్ విధానాన్ని తీసుకురానున్నారు. తొలి సారి ఒక వ్యక్తికి పేమెంట్ చేస్తున్నప్పుడు, అది రూ. 2 వేల కన్నా ఎక్కువ మొత్తమైతే.. ఆ లావాదేవీకి సంబంధించిన మొత్తం 4 గంటల తరువాతనే ఎదుటి వ్యక్తి ఖాతాలో జమ అవుతుంది. ఈ లోపు, ఆ లావాదేవీని రద్దు చేసుకోవచ్చు. లేదా, నగదు మొత్తంలో మార్పులు చేసుకోవచ్చు.

Whats_app_banner