EPFO guidelines on higher pension: పెన్షన్ మొత్తం పెంచుకునేందుకు ఇలా చేయండి..-epfo issues guidelines on higher pension after sc ruling how to apply ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Epfo Issues Guidelines On Higher Pension After Sc Ruling. How To Apply

EPFO guidelines on higher pension: పెన్షన్ మొత్తం పెంచుకునేందుకు ఇలా చేయండి..

HT Telugu Desk HT Telugu
Dec 30, 2022 04:45 PM IST

EPFO guidelines on higher pension: ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కు సంబంధించి ఈపీఎఫ్ఓ (Employees' Provident Fund Organisation EPFO) ముఖ్యమైన సమాచారం వెల్లడించింది. పెన్షన్ పెంపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలిపింది.

EPFO clarification also instructs EPFO members on how to apply for the higher pension after the Supreme Court order.
EPFO clarification also instructs EPFO members on how to apply for the higher pension after the Supreme Court order.

EPFO guidelines on higher pension: మరో 8 వారాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని ఈపీఎఫ్ఓ (Employees' Provident Fund Organisation EPFO) వెల్లడించింది. పెన్షన్ పెంపునకు సంబంధించి అర్హత, దరఖాస్తు విధానం తదితరాలను కూడా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

EPFO guidelines on higher pension: పెన్షన్ పెంపు వివరాలు..

భవిష్య నిధి() కి సంబంధించిన నియంత్రణ సంస్థ అయిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(Employees' Provident Fund Organisation EPFO) శుక్రవారం పీఎఫ్ చందాదారులైన రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంపుపై కీలక వివరాలను వెల్లడించింది. 2014 సెప్టెంబర్ 1వ తేదీ కన్నా ముందు రిటైర్ అయిన ఉద్యోగులు, ఇతర షరతులకు లోబడి, ఈ పెన్షన్ పెంపునకు అర్హులని పేర్కొంది. అలాగే, అప్పుడు వేతన పరిమితి అయిన 5 వేలు లేదా 6,500 పై బడి ఉన్న, ఈపీఎస్ (Employees’ Pension Scheme EPS) సభ్యులైన ఉద్యోగులు ఈ పెన్షన్ పెంపునకు అర్హులని తెలిపింది.సవరణకు ముందునాటి ఈపీఎస్ 95 (Employees’ Pension Scheme EPS 95) లో సభ్యులై ఉండి, జాయింట్ ఆప్షన్ ను ఎంచుకున్న సభ్యులు కూడా ఇందుకు అర్హులని ఈపీఎఫ్ఓ పేర్కొంది.

EPFO guidelines on higher pension: అప్లై చేసుకోవడం ఎలా?

అ పెన్షన్ పెంపు ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలనుకునే సభ్యులు ముందుగా సంబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి(regional EPFO office) వెళ్లాలి. అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు జత చేసిన తమ దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో కమిషనర్ పేర్కొన్న విధానంలో దరఖాస్తు ఉండాలి. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ ల్లో మార్పుచేర్పులకు సంబంధించి అనుమతి పత్రం అందించాల్సి ఉంటుంది.

EPFO guidelines on higher pension: సుప్రీంకోర్టు ఏమంది?

సెప్టెంబర్ 1, 2014 నాటికి ఈపీఎస్ 95 స్కీమ్ లో సభ్యులుగా ఉన్నవారు, పెన్షన్ కు అర్హమైన వేతనంలో 8.33% వరకు కాకుండా, తమ వాస్తవ వేతనంలో 8.33% వరకు పెన్షన్ ఫండ్ లో చెల్లించవచ్చని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తమ ఆదేశాలు వెలువడిన 4 నెలల లోపు సభ్యులు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

WhatsApp channel

టాపిక్