EPF higher pension: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ-epf account holders can get higher pension with this new epfo guidelines ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Epf Account Holders Can Get Higher Pension With This New Epfo Guidelines

EPF higher pension: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ఈపీఎఫ్ఓ

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 03:35 PM IST

EPF higher pension: అధిక పెన్షన్ (higher pension) కావాలనుకునే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ (Employees Provident Fund Organisation EPFO) శుభవార్త తెలిపింది. ఎక్కువ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

EPF higher pension: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees Provident Fund Organisation EPFO) ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన చేసింది. అధిక పెన్షన్ (higher pension) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారి కోసం కొత్తగా నియమనిబంధనలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

EPF higher pension: మార్చి 3 లాస్ట్ డేట్..

అధిక పెన్షన్ (higher pension) కావాలని కోరుకునే ఉద్యోగులు మార్చి 3 లోగా అందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లోపు అప్లై చేసుకోలేని వారికి తక్కువ పెన్షన్ అందుతుంది. 2014 ఆగస్ట్ 31 లోపు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (Employee Pension Scheme EPS) లో చేరినవారు మాత్రమే అధిక పెన్షన్ (higher pension) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగులు, మేనేజ్ మెంట్ ఉమ్మడిగా అప్లై చేయాల్సి ఉంటుంది. పెన్షన్ కు అర్హత కలిగిన గరిష్ట నెలవారీ వేతన పరిమితి అయిన రూ. 15 వేలకు మించి వేతనం ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారి వాస్తవ మూల వేతనం (actual basic salary) పై 8.33% మొత్తం పెన్షన్ స్కీమ్ కింద జమ అవుతుంది. పెన్షనబుల్ సాలరీ గరిష్ట పరిమితిని 2014 ఆగస్ట్ లో రూ. 6,500 నుంచి రూ. 15000 లకు పెంచారు.

EPF higher pension: త్వరలో ఆన్ లైన్ లో అప్లై చేసుకునే వీలు

అధిక పెన్షన్ (higher pension) ఆప్షన్ కోసం ఉద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వీలు త్వరలో కల్పిస్తామని ఈపీఎఫ్ఓ (EPFO) వెల్లడించింది. అందుకు సంబంధించిన యూఆర్ ఎల్ (unique resource location URL) ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం, ప్రతీ దరఖాస్తును డిజిటల్ గా రిజిస్టర్ చేసి, దరఖాస్తుదారుడికి రిసీట్ నెంబర్ అందించనున్నారు. సంబంధిత రీజనల్ పీఎఫ్ ఆఫీస్ ఈ దరఖాస్తులను పరిశీలించి, అధిక పెన్షన్ ఆప్షన్ ను అందించే విషయమై నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా దరఖాస్తుదారుడికి తెలియపరుస్తుంది. అర్హులైన ఉద్యోగులు యాజమాన్యాలతో కలిసి, అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1, 2014 లోపు ఈపీఎస్ (EPS) లో చేరి, ఇంకా ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు అధిక పెన్షన్ (higher pension) ఆప్షన్ ను కల్పించాలని గత నవంబర్ లో సుప్రీంకోర్టు ఈపీఎఫ్ఓ (EPFO) ను ఆదేశించింది.

WhatsApp channel