EMS IPO allotment: ఈఎంఎస్ ఐపీఓ అలాట్మెంట్ పూర్తయింది.. జీఎంపీ ఎంతో తెలుసా? అమ్మేయడం బెటరా? లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయాలా?-ems ipo allotment announced latest gmp how to check allotment status ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Ems Ipo Allotment Announced. Latest Gmp, How To Check Allotment Status

EMS IPO allotment: ఈఎంఎస్ ఐపీఓ అలాట్మెంట్ పూర్తయింది.. జీఎంపీ ఎంతో తెలుసా? అమ్మేయడం బెటరా? లాంగ్ టర్మ్ కు హోల్డ్ చేయాలా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Courtesy EMS Limited website)

EMS IPO allotment: ఈఎంఎస్ ఐపీఓ అలాట్మెంట్ ముగిసింది. అలాట్మెంట్ రానివారికి రీఫండ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈఎంఎస్ షేర్లు ప్రస్తుతం గ్రే మార్కెట్లో రూ. 100 ప్రీమియం (GMP) తో ట్రేడ్ అవుతున్నాయి.

EMS IPO allotment: ఈఎంఎస్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. ఐ పీఓ ప్రారంభమైన తొలిరోజే, కొన్ని గంటల వ్యవధిలోనే 100% సబ్ స్క్రైబ్ అయి, రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 15న ఈ ఐపీఓ అలాట్మెంట్ ప్రాసెస్ ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

లిస్టింగ్ ఎప్పుడు?

ఈ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ మార్కెట్లలో సెప్టెంబర్ 21వ తేదీన లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఐపీఓకు అప్లై చేసిన వారు తమకు అలాట్ అయ్యాయో లేదో ఆన్ లైన్ లో బీఎస్ఈ వెబ్ సైట్ bseindia.com ద్వారా కానీ, అధికారిక రిజిస్ట్రార్ వెబ్ సైట్ kosmic.kfintech.com. ద్వారా కానీ తెలుసుకోవచ్చు. లేదా డైరెక్ట్ గా ఈ bseindia.com/investors/appli_check.aspx లింక్ ను క్లిక్ చేయడం ద్వారా కానీ, https://kprism.kfintech.com/ipostatus లింక్ ను క్లిక్ చేయడం ద్వారా కానీ తెలుసుకోవచ్చు.

జీఎంపీ ఎంత?

ఈఎంఎస్ ఐపీఓపై ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారు. శనివారం ఈ షేర్లు గ్రే మార్కెట్లో రూ. 100 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. శుక్రవారం కూడా ఈ జీఎంపీ ఇంతే ఉంది. అంటే, లిస్టింగ్ రోజు ఇదే జీఎంపీ కొనసాగితే, రూ. 311 కు ఈ షేర్లు లిస్ట్ అయ్యే అవకాశముంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 200 - రూ. 211 అన్న విషయం తెలిసిందే. కాగా, లిస్టింగ్ గెయిన్స్ తీసుకుని తమకు అలాటైన షేర్లను అమ్మేయాలా? లేక లాంగ్ టర్మ్ లాభాల కొసం అట్టి పెట్టుకోవాలా? అన్న సంశయం ఇన్వెస్టర్లలో నెలకొన్నది. దీనిపై, లాంగ్ టర్మ్ లో ఈ షేర్లు మంచి లాభాలను సాధించే అవకాశం ఉందని, అందువల్ల లాంగ్ టర్మ్ లాభాల కొసం ఈ షేర్లను అట్టి పెట్టుకోవడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

అలాట్మెంట్ ఇలా తెలుసుకోండి..

  • ముందుగా bseindia.com/investors/appli_check.aspx లింక్ పై క్లిక్ చేయండి
  • ఈక్విటీ పై క్లిక్ చేయండి.
  • ఇష్యూ నేమ్ అని ఉన్న దగ్గర EMS IPO ను సెలెక్ట్ చేసుకోండి.
  • అప్లికేషన్ నెంబర్, పాన్ నెంబర్ లను ఎంటర్ చేయండి.
  • 'I'm not a robot ను క్లిక్ చేయండి
  • సెర్చ్ పై క్లిక్ చేయండి
  • మీ అలాట్మెంట్ స్టేటస్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

WhatsApp channel