IPO news: ఈ ఎస్ఎంఈ ఐపీఓ కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన; తొలిరోజే ఓవర్ సబ్ స్క్రైబ్; రూ. 100 జీఎంపీ
Emmforce Autotech IPO: చిన్న, మధ్య తరహా సెగ్మెంట్లో స్టాక్ మార్కెట్లో అడుగెపెట్టబోతున్న ఎమ్ ఫోర్స్ ఆటో టెక్ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. తొలి రోజే ఈ ఐపీఓ ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. మంగళవారం ఈ కంపెనీ షేర్ రూ. 100 కు పైగా ప్రీమియంతో గ్రే మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.
Emmforce Autotech IPO: ఆటోమోటివ్ రంగంలోని ప్రముఖ సంస్థ ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ ఏప్రిల్ 23న సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. ఈ ఐపీఓకు ఏప్రిల్ 25 గురువారం వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ ఇష్యూ ధరను రూ.93 నుంచి రూ.98 మధ్య నిర్ణయించారు. ఈ ఐపీఓ లాట్ సైజులో 1,200 షేర్లు ఉండగా, ఇన్వెస్టర్లు కనీసం 1,200 ఈక్విటీ షేర్లకు బిడ్లు వేయవచ్చు.

35% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్
ఈ ఐపీఓ లో కనీసం 50 శాతం క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB)కు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్ ఇన్ స్టిట్యూషనల్ బిడ్డర్లకు కేటాయించారు. మొత్తం 15.66 లక్షల ఈక్విటీ షేర్లను రూ.98 చొప్పున విక్రయించడం ద్వారా ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ (Emmforce Autotech IPO) తన యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.15.34 కోట్లు సమీకరించింది.
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ కంపెనీ వివరాలు
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ కంపెనీ స్పెషలిస్ట్ ఆటోమొబైల్ డ్రైవ్ ట్రైన్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువగా 4 వీల్ డ్రైవ్ కార్లు, రేసింగ్ కార్ల డ్రైవ్ ట్రైన్ లను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డిఫరెన్షియల్ హూజింగ్స్, డిఫరెన్షియల్ లాక్స్, డిఫరెన్షియల్ కవర్లు, 4డబ్ల్యూడీ లాకింగ్ హబ్స్, స్పిండిల్స్, యాక్సిల్స్ అండ్ షాఫ్ట్స్, గేర్ షిఫ్టర్లు, నూక్, డిఫరెన్షియల్ స్పూల్స్, డిఫరెన్షియల్ టూల్స తో పాటు వివిధ రకాల డిఫరెన్షియల్ ఫోర్జ్డ్, కాస్ట్ పార్ట్స్ ను వివిధ ఆటోమొబైల్ సంస్థలకు సరఫరా చేస్తుంది.
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ సబ్ స్క్రిప్షన్
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ (Emmforce Autotech IPO) మొదటిరోజే ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. మంగళవారం మధ్యాహ్నానికే 19.82 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. మొదటి రోజు రిటైల్ విభాగం 26.86 రెట్లు, ఎన్ఐఐ కేటగిరీ 28.53 రెట్లు సబ్ స్క్రైబ్ అయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషన్స్ బయ్యర్స్ (QIB) వాటా 99 శాతం బుక్ అయింది. మొత్తం 36,57,600 షేర్లకు గాను 7,25,10,000 షేర్లకు బిడ్లు వచ్చాయి.
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ వివరాలు
సుమారు రూ.53.90 కోట్ల విలువైన ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓలో (Emmforce Autotech IPO) రూ.10 ముఖ విలువ కలిగిన 5,499,600 ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉంది. ఆఫర్ ఫర్ సేల్ కాంపోనెంట్ లేదు. ఈ ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, నిర్వహణ మూలధనం, మార్జిన్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించనున్నారు.
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ జీఎంపీ
ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ ఐపీఓ జీఎంపీ (Emmforce Autotech IPO GMP) లేదా గ్రే మార్కెట్ ప్రీమియం మంగళవారం రూ. 100 కు పైగానే ఉంది. అంటే గరిష్ట ఇష్యూ ధర అయిన రూ. 98 పై రూ. 100 ప్రీమియం (GMP)తో అంటే, లిస్టింగ్ రోజు ఎమ్ ఫోర్స్ ఆటోటెక్ షేర్లు స్టాక్ మార్కెట్ లో కనీసం రూ. 198 ధరతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇష్యూ ధర కన్నా 102% ఎక్కువ.