HDFC interest rate : కస్టమర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షాక్! ఈఎంలపై మరింత భారం!
HDFC Bank hikes MCLR : హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచింది. ఫలితంగా కస్టమర్లపై ఈఎంఐల భారం మరింత పెరిగే అవకాశం ఉంది.
HDFC Bank hikes MCLR : ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్)ని పెంచుతూ.. కస్టమర్లకు షాక్ ఇచ్చింది దిగ్గజ హెచ్డీఎఫ్సీ బ్యాంక్! కొన్ని టెన్యూర్లకు ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ చర్యలతో.. ఈఎంల భారం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు!
ఎంసీఎల్ఆర్లో మార్పులు ఇలా..
ఏదైనా లోన్‌కు బ్యాంక్ వసులు చేసే కనీస వడ్డీ రేటు.. ఈ ఎంసీఎల్ఆర్. ఇలా కనిష్ఠ వడ్డీ రేటు పెరిగితే.. ప్రజలపై భారం పడుతుంది. ఏదైనా బ్యాంక్.. ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్ యీల్డ్కు తగ్గట్టుగానే.. వడ్డీ రేట్లను ఆఫర్ చేయాలి. 2019 అక్టోబర్ 1 నుంచి ఇదే ఆనవాయతీగా వస్తోంది. ఇక ఇటీవలే జరిగిన ఎంపీసీ (మొనేటరీ పాలసీ కమిటీ) మీటింగ్‌లో.. రెపో రేట్లను మార్చకూడదని ఆర్బీఐ నిర్ణయించుకుంది. ఫలితంగా వరుసగా నాలుగోసారి రేపో రేటు 6.5శాతంగా ఉండిపోయింది.
HDFC Bank lending rates : ఈ పరిణమాల మధ్య.. ఎంసీఎల్ఆర్ను పెంచింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఫలితంగా.. ఈ బ్యాంక్‌లో ఎంసీఎల్ఆర్ ఇలా ఉంది..
- ఓవర్‌నైట్ (1 రోజు)- 8.60శాతం
- 1 నెల - 8.65శాతం
- 3 నెలలు - 8.85శాతం
- 6 నెలలు- 9.10శాతం
- ఏడాది- 9.20శాతం
- 2ఏళ్లు- 9.20శాతం
- 3ఏళ్లు- 9.25శాతం.
అంటే.. హోం లోన్లు, పర్సనల్ లోన్లతో పాటు ఏదైనా లోన్ తీసుకోవాలని వెళితే.. టెన్యూర్ బట్టి, ఇవి కనిష్ఠ వడ్డీ రేట్లుగా ఉంటాయి!
ఎఫ్డీలపై ఇలా..
FD interest rate in HDFC bank : ఇక కొన్ని ఎంపిక చేసిన టెన్యూర్లపై ఎఫ్డీలను ఇటీవలే తగ్గించింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఫలితంగా 7 రోజులు- 10సంవత్సరాల కాలవ్యవధి మధ్యలో ఉన్న ఎఫ్డీలపై ఇప్పుడు 3శాతం నుంచి 7.20శాతం వరకు వడ్డీ లభిస్తోంది. అదే.. సీనియర్ సిటీజెన్లకు.. ఇది 3.5శాతం నుంచి 7.75శాతం వరకు ఉంటుంది. ఈ మార్పులు.. 2023 అక్టోబర్ 1న అమల్లోకి వచ్చాయి.
సంబంధిత కథనం