TruthGPT - Elon Musk: చాట్‍జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ‘ట్రూత్‍జీపీటీ!: వివరాలివే-elon musk to launch truthgpt to compete chatgpt ai chatbot ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Elon Musk To Launch Truthgpt To Compete Chatgpt Ai Chatbot

TruthGPT - Elon Musk: చాట్‍జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ‘ట్రూత్‍జీపీటీ!: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 18, 2023 09:58 AM IST

TruthGPT - Elon Musk: ఏఐ చాట్‍బోట్‍ను త్వరలో లాంచ్ చేయనున్నట్టు ఎలాన్ మస్క్ చెప్పారు. ప్రపంచం స్వభావాన్ని అర్థం చేసుకునేలా ఇది ఉంటుందని అన్నారు.

TruthGPT - Elon Musk: చాట్‍జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ‘ట్రూత్‍జీపీటీ!
TruthGPT - Elon Musk: చాట్‍జీపీటీకి పోటీగా ఎలాన్ మస్క్ ‘ట్రూత్‍జీపీటీ! (REUTERS)

TruthGPT - Elon Musk: చాట్‍జీపీటీ సూపర్ సక్సెస్ సాధించడంతో టాప్ టెక్ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బేస్డ్ చాట్ బోట్‍లపై మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే గూగుల్ కూడా బార్డ్ ఏఐ చాట్‍బోట్‍ను పరీక్షిస్తోంది. ఇప్పుడు టెస్లా, ట్విట్టర్ కంపెనీల సీఈవో ఎలాన్ మస్క్ కూడా చాట్‍జీపీటీ(ChatGPT)కి పోటీని తీసుకొస్తున్నారు. “ట్రూత్‍జీపీటీ” (TruthGPT) ఏఐ చాట్‍బోట్‍ను లాంచ్ చేయనున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ప్రపంచ స్వభావాన్ని అర్థం చేసుకునేలా..

TruthGPT - Elon Musk: “‘ట్రూత్‍జీపీటీ’ అని నేను పిలుచుకునే దాన్ని ప్రారంభించబోతున్నాను. ప్రపంచం స్వభావాన్ని, తీరును అర్థం చేసుకొని ఇది గరిష్టంగా సత్యాలను అన్వేషించే ఏఐగా ఉంటుంది” అని ఫాక్స్ న్యూస్ చానెల్‍కు చెందిన టకర్ కార్ల్‌సన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ తెలిపారు. అంటే, యూజర్లు అడిగే వాటికి సాధ్యమైనంత మేర నిజాలను సేకరించి ఈ ఏఐ చాట్‍బోట్ సమాధానాలను ఇస్తుందనేలా మస్క్ మాట్లాడారు. అయితే, ప్రస్తుతం మస్క్.. ట్రూత్‍జీపీటీ అని పేరు చెప్పినా.. ఆయన తీసుకొచ్చే ఏఐ చాట్‍బోట్‍కు ఫైనల్ నేమ్ ఇదే ఉంటుందా అనే విషయంపై స్పష్టతనివ్వలేదు.

TruthGPT - Elon Musk: “ప్రపంచ స్వభావాన్ని అర్థం చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం సేఫ్టీకి సరైన మార్గం అని నేను అనుకుంటున్నా. అలా అయితే ఏఐ.. మనుషులను నాశనం చేయదు. ఎందుకంటే ప్రపంచంలో మానవులు చాలా ముఖ్యమైన భాగం” అని మస్క్ అని అన్నారు. చాలా మంది నిపుణులు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

TruthGPT - Elon Musk: కాగా, ఏఐ చాట్‍బోట్‍ను ఎప్పటికల్లా లాంచ్ చేయనున్నది మస్క్ స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఈ విషయంపై ఆయన సీరియస్‍గా ఉన్నట్టు అర్థమవుతోంది. X.AI అనే ఏఐ కంపెనీని కూడా ఆయన సైలెంట్‍గా మార్చిలో ప్రారంభించారు.

ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ గతేడాది లాంచ్ చేసిన చాట్‍జీపీటీ ఏఐ చాట్‍బోట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో హిట్ అయింది. ఓపెన్ ఏఐకు మైక్రోసాఫ్ట్ ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది. ఎలాంటి ప్రశ్నకైనా టెక్స్ట్ రూపంలో వివరంగా సమాధానాలు ఇస్తుండటంతో చాట్‍జీపీటీ సంచలనం సృష్టిస్తోంది. నిత్యం కోట్లాది మంది ఈ చాట్‍జీపీటీ ప్లాట్‍ఫామ్ ఉపయోగిస్తున్నారు. టెక్స్ట్ రూపంలో చాట్‍జీపీటీతో ముచ్చటిస్తూ అనే విషయాలు తెలుసుకుంటున్నారు. చాలా పనులను సులభంగా పూర్తి చేసుకుంటున్నారు. అయితే, ఏఐ చాట్‍బోట్‍లు చాలా మంది ఉద్యోగాలకు ఎసరుగా మారతాయన్న ఆందోళనలు ఉన్నాయి.

TruthGPT - Elon Musk: టెక్ దిగ్గజం గూగుల్ కూడా ప్రస్తుతం బార్డ్ పేరుతో ఏఐ చాట్‍బోట్‍ను టెస్ట్ చేస్తోంది. ఇప్పటికే దీన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. టెస్టింగ్ పూర్తి చేసి.. వీలైనంత త్వరగా యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

మరోవైపు, చాట్‍జీపీటీని తన సెర్చ్ ఇంజిన్ బింజ్, బ్రౌజర్ ఎడ్జ్, సహా మరిన్ని అప్లికేషన్లు, సర్వీసుల్లో ఇంటిగ్రేట్ చేస్తోంది మైక్రోసాఫ్ట్. దీంతో వాటి వాడకం గణనీయంగా పెరుగుతోందని భావిస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం